ఎన్టీఆర్ బయోపిక్: వెన్నుపోటు రాజకీయాలు చూపాలి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహభసభల్లో ఎన్టీఆర్ పేరును స్మరించుకోకపోవడం భాదాకరమని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ను విస్మరించిన ప్రపంచ తెలుగు మహసభలకు బాలకృష్ణ ఎందుకు హజరయ్యారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
ఎన్టీఆర్ 22వ, వర్ధంతిని పురస్కరించుకొని గురువారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ పేరును ప్రపంచ తెలుగు మహసభల్లో స్మరించుకోకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం ఏపీ సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. అందుకే ఇప్పటివరకు ఎన్టీఆర్ కు భారతరత్న రాలేదని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పేరు లేకుండా చేసేందుకే ఏపీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు చంద్రబాబునాయుడు పేరు పెడుతున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పరితపించేవాడని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ప్రజల కోసం ఎన్టీఆర్ మళ్లీ పుడతారన్నారని ఆమె గుఅభిప్రాయపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్టీఆర్‌ను గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలంతా ఎన్టీఆర్‌ను గౌరవిస్తారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.
కాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా తీస్తే ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటకు రావాలన్నారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా?అని ఆమె ప్రశ్నించారు.
ఎన్టీఆర్‌కు చివరి రోజుల్లో అన్యాయం జరిగిందని, బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్‌లో వెన్నుపోటు గురించి చెప్పాలని అన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలు నిలబెట్టే అసలైన వారసురాలు తానేనని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబుని గద్దె దించిన తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications