కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేత ముద్దగౌని రామ్మోహన్: రేవంత్ సంచలన ఆరోపణ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంఛార్జ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గురువారం హస్తం పార్టీలో చేరారు.

తన సతీమణి, మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్నతో కలిసి హస్తం గూటికి చేరారు రామ్మోహన్ గౌడ్. గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా, ఎల్బీనగర్ నియోజకవర్గం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డికే సీఎం కేసీఆర్ ఇవ్వడంతో రామ్మోహన్ గౌడ్ అసంతృప్తికి గురయ్యారు.

LB Nagar BRS Incharge muddagouni ram mohan goud joins congress party

ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా.. దక్కకపోవడంతో రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ ఆయనకే బీఆర్ఎస్ టికెట్ లభించింది.

ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి వరుసగా రెండు సార్లు ఓడిపోయినా.. నిత్యం ప్రజల్లో ఉంటున్నట్లు రామ్మోహన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని అన్నారు.

ఇది ఇలావుండగా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్సన్ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి సహా ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కార్యకర్తలను అక్రమ కేసులతో ఇబ్బంది పెడితే ఊరుకోబోమని అన్నారు.

డీజీపీని తొలగించాలని డిమాండ్ చేశారు రేవంత్. కాంగ్రెస్ అనుకూలురులపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల పోన్లపై నిఘా పెట్టారని.. కాంగ్రెస్ కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. 45 రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+