హెటిరో ల్యాబ్‌లో చిరుతపులి కలకలం: దాడికి యత్నం, చివరకు బంధీగా..(వీడియో)
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్‌లో చిరుతపులి కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు హెటిరోకి అడుగుపెట్టిన చిరుత.. ఉద్యోగులను బెంబేలెత్తించింది. దీంతో ఉద్యోగులంతా ఒక గదిలో ఉండిపోయి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. మరో గదిలో చిరుతను ఉండిపోయింది.

చిరుతను బంధించిన జూ సిబ్బంది
ఆ తర్వాత అధికారులకు ఉద్యోగులు సమాచారమిచ్చారు. చిరుతను బంధించడానికి హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ నుంచి ప్రత్యేక బృందం ఇక్కడకు వచ్చింది. పలువు విధాలుగా ప్రయత్నించి.. చివరకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను జూపార్క్ బృందం బంధించింది.
హెటిరో సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన చిరుత
అనంతరం చిరుతను అక్కడ్నుంచి జూ పార్క్ తరలించారు. కాగా, చిరుతపులి తెల్లవారుజామున 4 గంటలకు హెటిరో ల్యాబ్ హెచ్ బ్లాక్‌లోకి వచ్చిందని తెలిపారు ఉద్యోగులు. చిరుతను చూసి తీవ్ర భయాందోళనలకు గురైనట్లు చెప్పారు. వెంటనే ఓ గదిలోకి వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. అయితే, చిరుత పలుమార్లు గ్లాస్ వెనుకాల ఉన్న హెటిరో సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అడ్డుగా గ్లాస్ ఉండటంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
పెరిగిన పులుల సంచారం
కాగా, ఇటీవల కాలంలో తెలంగాణలో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా పులుల సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొంత కాలం క్రితం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా పులులు కలకలం సృష్టించాయి. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications