గొడవలొద్దు.. కలిసి అభివృద్ధి చేసుకుందాం.. తెలంగాణాకు మంత్రి నిమ్మల పిలుపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనలతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు. సుప్రీంతీర్పుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎవరికీ నష్టం ఉండదని ఆయన అన్నారు.
తెలంగాణా సహకరించాలి: మంత్రి నిమ్మల
రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని మొదటి నుంచి తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. సముద్రంలో వృధాగా కలిసే దాదాపు 3 వేల టీఎంసీల నీటిలో కేవలం 2 టిఎంసిలను మాత్రమే ప్రాజెక్ట్ కు వినియోగించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అపోహలను వీడి, ఇప్పటికైనా ప్రాజెక్టుకు సహకరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష కూడా అదే
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం వాటిల్లదని, తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని, తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష కూడా అదేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 50 సంవత్సరాలలో గోదావరి వరద నీరు ఒక లక్ష యాభై మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలిసిపోయాయని గుర్తుచేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణాకు ఏ నష్టం లేదు
ఈ ఏడాది కూడా 4600 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లిపోయిందని తెలిపారు. గోదావరి వరద నీటిని పోలవరం వద్ద వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని, లేదంటే అది సముద్రంలో కలిసిపోతుందని పేర్కొన్నారు. కేవలం వృధా జలాలను మాత్రమే వినియోగించుకుంటున్నామని గుర్తుచేసి దీనివల్ల తెలంగాణకు నష్టం వాటిల్లే ప్రశ్న లేదని స్పష్టం చేశారు.
సహజ న్యాయ సూత్రాలకు లోబడి ఏపీ ప్రాజెక్ట్
రాష్ట్ర విభజన తర్వాత గోదావరి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇచ్చారో అదే రీతిలో దిగువన పోలవరం నల్లమల సాగర్ కు అనుమతులు ఇవ్వాలని తాము కోరుతున్నామని తెలిపారు. తమ విజ్ఞప్తి సహజ న్యాయ సూత్రాలకు లోబడి ఉందని, సమంజసమైనది, సహేతుకమైనది అని నిమ్మల రామానాయుడు నొక్కి చెప్పారు.
ప్రాజెక్ట్ తో ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం
తెలంగాణ రాష్ట్రం గోదావరిలో పుష్కలంగా నీరు ఉందని కాళేశ్వరం నిర్మించినప్పుడు, తాము ఎటువంటి అడ్డంకులు చెప్పలేదన్నారు. ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ కూడా అదేవిధంగా సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరితే ఆ తర్వాత తెలంగాణకు కూడా ప్రయోజనం చేకూరుతుందని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications