అప్పుడు అలాగే, ఇప్పుడు అలాగే, తెలంగాణ సాధించినట్లే సాధిస్తా: కేసీఆర్ ధీమా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఉద్యమం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లుగానే ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ల కోటా సాధిస్తానని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. పార్లమెంటులో బిల్లు కోసం పోరాడుతామన్నారు.

రాజీనామా: అన్నీ చేశారు కానీ, రేవంత్ తెలివిగా తప్పించుకుంటున్నారా?

Viral Song Celebrates Telangana Irrigation Project Agitation
 అప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు అదే, సాధిస్తాను

అప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు అదే, సాధిస్తాను

2001లో తాను తెలంగాణ కోసం ఉద్యమించానని, అప్పుడు అందరు అది అసాధ్యమని చెప్పారని, కానీ అది తప్పు అని నేను రుజువు చేశానని కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. అలాగే, ఇప్పుడు ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కూడా అసాధ్యమని చెబుతున్నారని, కానీ సాధిస్తాననే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

 మోడీ కాదంటే సుప్రీం కోర్టుకు వెళ్తాం

మోడీ కాదంటే సుప్రీం కోర్టుకు వెళ్తాం

తమిళనాడు తరహాలో పార్లమెంటు ఆమోదంతో తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలని ప్రధాని మోడీకి వివరించినట్లు కేసీఆర్ చెప్పారు. ఆయన సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కేంద్రం ఇవ్వకుంటే కనుక సుప్రీం కోర్టులో పోరాడుదామని చెప్పారు. వీటిని రాజకీయం చేయడం తగదని చెప్పారు. అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్తానని చెప్పారు. శీతాకాల సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుదారన్నారు.

 కేంద్రం పరిధిలోనిది, పీవీ నాడు తోడ్పాటు అందించారు

కేంద్రం పరిధిలోనిది, పీవీ నాడు తోడ్పాటు అందించారు

దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మైనార్టీల కోసం రూ.932 కోట్లు ఖర్చుపెడితే, మూడున్నరేళ్లలో తమ ప్రభుత్వం రూ.2,146 కోట్లు ఖర్చు పెట్టిందని కేసీఆర్ అన్నారు. ముస్లింలు ఈ దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్సే కారణమన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ముస్లింలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయించలేదన్నారు.

రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలోని అంశం కాదనీ, కేంద్రం పరిధిలో ఉందన్నారు. తమిళనాడులో రిజర్వేషన్ల పెంపునకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు పూర్తి తోడ్పాటును అందించారన్నారు.

 మాకు ఆట కాదు, బాధ్యత

మాకు ఆట కాదు, బాధ్యత

రాజకీయాలు అనేవి టీఆర్ఎస్‌కు ఆట కాదని, బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తన మొదటి లక్ష్యం తెలంగాణ రాష్ట్రం, రెండో లకష్యం తెలంగాణ పునర్ నిర్మాణం అన్నారు. ఈ దిశగా సాగుతున్నామన్నారు. చర్చిలోని పాస్టర్లు, రెవరెండ్‌లకు కూడా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా సాయం అందిస్తామన్నారు.

 ఉర్దూ ఇక ద్వితీయ అధికార భాష

ఉర్దూ ఇక ద్వితీయ అధికార భాష

ఉర్దూ ఇక ద్వితీయ అధికార భాష అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఉర్దూ అధికారుల నియామకం ఉంటుందన్నారు. తెలంగాణ దైవభూమి అన్నారు. నిజాం గొప్ప రాజు అని, ఆయన చరిత్రను పునర్లిఖిస్తామని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister K. Chandrasekhar Rao on Thursday expressed co-nfidence that he would secure 12 per cent quota for Muslims in education and employment in the same manner in which he had achieved statehood for Telangana.
Please Wait while comments are loading...