కెసిఆర్ రివ్యూ: మెట్రో చక్కర్లు, శంషాబాద్‌కూ(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో రైలును శివార్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తొలి దశగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఈ మెట్రోరైలును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు కారిడార్ 1, అలాగే సికిందరాబాద్ జెబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు కారిడార్ 2, నాగోల్ నుంచి శిల్పారామం వరకు కారిడార్ 3లో పనులు ప్రారంభమైన కొద్దిరోజులకే అంటే దాదాపు ఏడాదిన్నర కాలం క్రితం అధికారులు ముందుచూపుతో శివార్లకు ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రతిపాదనల ముసాయిదాను తయారు చేశారు.
ప్రస్తుతం నగరంలో చురుకుగా సాగుతున్న మొదటి దశ మెట్రోపనులు ఊపందుకున్న తర్వాత రెండో దశగా మెట్రోరైలు ప్రాజెక్టును హయత్‌నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు అందుబాటులోకి తేవాలని అధికారులు యోచించారు.
కాగా, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఐటి పరంగా రోజురోజుకీ అభివృద్ధి చెందుతుండటంతో జాతీయ, అంతర్జాతీయ ఐటి నిపుణులు, పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో వారు ఎయిర్‌పోర్టు చేరుకోవాలన్న సంకల్పంతో మెట్రోరైలును అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
కూకట్‌పల్లిలో మెట్రో చక్కర్లు
మియాపూర్ నుంచి కెపిహెచ్‌బికాలనీ వరకు మెట్రోరైల్ ట్రయల్ రన్‌లో భాగంగా పలుమార్లు చక్కర్లు కొట్టింది. అధికారులు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రైల్‌ను పట్టాలపై పరెగెత్తించారు. హైదర్‌నగర్, కెపిహెచ్‌బి, కూకట్‌పల్లి స్టేషన్‌లలో ఆపుతూ టెస్ట్ డ్రైవ్‌ను కొనసాగించారు.

కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో రైలును శివార్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

కెసిఆర్ సమీక్ష
తొలి దశగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఈ మెట్రోరైలును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

కెసిఆర్ సమీక్ష
అధికారులు ముందుచూపుతో శివార్లకు ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రతిపాదనల ముసాయిదాను తయారు చేశారు.

కెసిఆర్ సమీక్ష
ప్రస్తుతం నగరంలో చురుకుగా సాగుతున్న మొదటి దశ మెట్రోపనులు ఊపందుకున్న తర్వాత రెండో దశగా మెట్రోరైలు ప్రాజెక్టును హయత్‌నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు అందుబాటులోకి తేవాలని అధికారులు యోచించారు.

మెట్రో చక్కర్లు
మియాపూర్ నుంచి కెపిహెచ్‌బికాలనీ వరకు మెట్రోరైల్ ట్రయల్ రన్‌లో భాగంగా పలుమార్లు చక్కర్లు కొట్టింది.

మెట్రో చక్కర్లు
అధికారులు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రైల్‌ను పట్టాలపై పరెగెత్తించారు.

మెట్రో చక్కర్లు
హైదర్‌నగర్, కెపిహెచ్‌బి, కూకట్‌పల్లి స్టేషన్‌లలో ఆపుతూ టెస్ట్ డ్రైవ్‌ను కొనసాగించారు.












Click it and Unblock the Notifications