Liquor: బీర్ల కొరతతో అల్లాడుతున్న మద్యం ప్రియులు..
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో ప్రజలు కూల్ డ్రిక్స్, చెరకు రసం, జ్యూసుల వైపు మొగ్గు చూతున్నారు. అయితే కూల్ డ్రిక్స్, జ్యూస్ ఏం తాగుతామనుకున్న మద్యం ప్రియులు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తాగేస్తున్నారు. బీర్లు తాగి బిందాస్ గా ఉందామనకుంటే.. బీర్ల కొరత ఏర్పడింది. దీంతో బీర్ల సరఫరా పెంచాలని మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. మద్యం డిపోలకు సరఫరా నిలిచిపోవడంతో కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ లిక్కర్ గోదాములకు సరఫరా చేసిన బీరు నిల్వలకు డబ్బులు చెల్లించపోవడంతో సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ డిపోకు సరఫరా నిలిచిపోయింది. దీంతో బీర్ల కొరత ఏర్పడింది. లిక్కర్ డిపో పరిధిలో 135 వైన్ షాపులు, 28 బార్లు ఉన్నాయి. వీటికి రేషియో ప్రకారం పంపిణీ చేస్తారు.

ఈ మార్చిలో 1.80లక్షల బీరు కేసులు విక్రయించారు. అయితే గత సంవత్సరం దృష్టిలో ఉంచుకుని గోదాములో బీర్ల నిల్వ చేయలేదు. దీంతో అప్పుడు కొరత రాలేదు. గత సంవత్సరం రాష్ట్రంలో భారీగా బీర్ల అమ్మకాలు జరిగాయి. గత మేలో 4 కోట్ల 23 లక్షల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన రోజుకు 23,50,164 బీర్లు చెబుతున్నారు. మే 1 నుంచి 18 వరకేనని అధికారులు తెలిపారు.
ఈసారి కూడా బీర్ల అమ్మకాలు భారీగా ఉంటాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగా బీర్లను సరఫరా చేయాలని తయారీదారులను కోరింది.












Click it and Unblock the Notifications