మందు బాబులకు షాకే.. భారీగా పెరగనున్న మద్యం ధరలు!

తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుంది. రాష్ట్రంలో మద్యం ధరల పెంపునకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. ధరల పెంపునకు అనుకూలంగా ఎక్సైజ్ శాఖకు చెందిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే రిపోర్టు అందించినట్లు సమాచారం. కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసిన ఎక్సైజ్ శాఖ.. మద్యం ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.

సచివాలయంలో గత కొద్ది రోజులుగా ఎక్సైజ్ శాఖ అధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్స్, బీర్లపై 15 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే, చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది.

Liquor prices to increase soon in Telangana

కాగా, ఇప్పటికే బీర్ల ధరలు పెంచాలని తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బీర్ల సరఫరాదారు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అంతకుముందు బకాయిలు, బీర్ల ధరలు పెంచాలంటూ రాష్ట్రంలో కొన్ని రోజులపాటు బీర్ల సరఫరాను కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే.

అయితే, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో మళ్లీ కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను తెలంగాణ రాష్ట్రంలో యూబీఎల్ పునరుద్ధరించింది. సెబీ రెగ్యూలేషన్స్ కి అనుగుణంగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను వెంటనే అమలులోకి తీసుకొస్తున్నట్లు యూబీఎల్ ప్రకటించింది. తాము తెలంగాణ బేవరేజెస్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదల వంటి సమస్యలకు తెలంగాణ బేవరేజెస్ సమయానుకూలంా స్పందిస్తామని హామీ ఇచ్చిందని యూబీఎల్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+