ఫుల్ కిక్కే కిక్కు..మందు బాబుల అసలు పండుగ..!!
దసరా మందు బాబులకు ఫుల్లు కిక్కు అందించింది. రాష్ట్ర ఖజానాకు పండుగ తెచ్చింది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. రెండు రోజుల్లోనే దాదాపు రూ 420 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ రోజుల అమ్మకాలతో పోల్చితే ఇవి చాలా రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ సారి దసరా అక్టోబర్ 2న రావటంతో మద్యం అమ్మకాలు ఆ రోజున లేకపోవటంతో ఎక్సైజ్ అధికారులు ఆలోచనలో పడ్డారు. మందుబాబులు మాత్రం ఖజానా కు పండుగ ఆదాయం భారీగా తెచ్చారు.
దసరా పండుగ వేళ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటో తేదీల్లో మందుబాబులు భారీగా మద్యం కొనుగోలు చేశారు. రెండు రోజుల్లో రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ ఒకటో తేదీన 86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయని వివరించారు.

దసరా, అక్టోబర్ 2(గాంధీ జయంతి) ఒకేరోజు రావడంతో.. అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దసరా, అక్టోబర్ 2(గాంధీ జయంతి) ఒకేరోజు రావడంతో.. అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతోపాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. దీని ఎఫెక్ట్ దసరా పండుగపై పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితోపాటు దసరా పండుగ కూడా వచ్చింది. ఆ రోజు మద్యం షాపులు బంద్ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 1వ తేదీనే వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. వైన్ షాపులు, లిక్కర్ మార్ట్ ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి.
ఈ క్రమంలో దసరా, అక్టోబర్ 2 ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ప్రతీ ఏటా దసరా వేళ ఎక్సైజ్ శాఖ కు లిక్కర్ అమ్మకాలతో భారీగా ఆదాయం సమ కూరుతోంది. ఈ సారి అంతకు మించి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అటు మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించటంతో... ఎక్సైజ్ శాఖ ప్రస్తుతం కొత్త దుకాణాల ఖరారు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.












Click it and Unblock the Notifications