కలకలం: ఉప్పల్‌లో ఎల్కేజీ చిన్నారి కిడ్నాప్

ఉప్పల్‌ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌లో ఎల్‌కేజీ చదువుతున్న ఓ చిన్నారి అదృశ్యమైంది.తమ బిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని తల్లిదండ్రులు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌: ఉప్పల్‌ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌లో ఎల్‌కేజీ చదువుతున్న ఓ చిన్నారి అదృశ్యమైంది. కాగా, తమ బిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని తల్లిదండ్రులు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్‌ జీవనోపాధి కోసం ఇటీవలే నగరానికి వచ్చి టాటా కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య నిషామీనా, కూతురు ఆరోహి మీనాలతో కలిసి చిలుకానగర్‌లో నివాసముంటున్నాడు. కూతురు ఆరోహి మీనా.. స్థానిక నలంద పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది.

LKG girl child kidnapped in Uppal in Hyderabad on Monday.

సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో ఇంటివద్ద స్నేహితులతో ఆడుకుంటున్న ఆరోహి మీనా కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదంద్రులు తీవ్ర ఆంందోళనకు గురై సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

అనంతరం తమ కూతురిని గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకుని పరారయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+