• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాడుపని చేస్తూ .. భర్త అడ్డుగా ఉన్నాడని పక్కా ప్లాన్ చేసి ప్రాణం తీసిన ఇల్లాలు

|

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఇద్దరు బిడ్డల తల్లి అయిన తరువాత ఓ ఇల్లాలు భర్త కు విషాహారం తినిపించి ప్రాణాలు తీసింది. వివాహ బంధానికి, దాంపత్యం అనే మాటకు అర్థం లేకుండా అర్ధాంగి అనే పదాన్ని మరచి ఓ మహిళ చేసిన ఘాతుకం సభ్యసమాజాన్ని నివ్వెరపరిచింది. నాతిచరామి అంటూ వివాహబంధంతో ముడిపడిన వారి దాంపత్యం మూన్నాళ్ళ ముచ్చటే అయింది.

తెలంగాణా ఈఎస్ఐ మందుల భారీ కుంభకోణం .. విస్తుబోయే వాస్తవాలు.. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్తెలంగాణా ఈఎస్ఐ మందుల భారీ కుంభకోణం .. విస్తుబోయే వాస్తవాలు.. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్

వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య భర్తను అడ్డు తొలగించుకోవడానికి చేసిన ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మూడు గుడిసెల తండాకు చెందిన 30 ఏళ్ల వయసున్న మాలోత్ మోహన్ పావని ని పెళ్లి చేసుకున్నాడు .వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. ఇక ఈ సమయంలో ఈ మధ్యకాలంలో అదే గ్రామానికి చెందిన అజ్మీర శ్రీనుతో పావని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం విషయం తెలిసిన భర్త పలుమార్లు పావని హెచ్చరించారు. అయినా పావని వినకపోవడంతో దీనిని పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెట్టిన పెద్దలు పావనిని మందలించారు. భర్తతో సజావుగా కాపురం చేసుకోమని చెప్పి పంపించారు.

 llegal affair .. wife killed her husband by giving poisoness food

పంచాయితీ పెట్టి పరువు తీశాడన్న కోపంతోపాటు, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న భావనతో భర్తపై కక్ష పెంచుకున్న పావని ప్రియుడు శ్రీనుతో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను అడ్డు తొలగించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో విషం కలిపిన ఆహారాన్ని అతడికి పెట్టింది. భోజనం తిన్న మోహన్ కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గమనించిన మోహన్ తల్లి హేమ్లీ, గ్రామస్థుల సాయంతో కుమారుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసింది. కానీ మార్గ మధ్యలోనే మోహన్ ప్రాణాలు విడిచాడు. మోహన్ తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆహారంలో విషం కలిపి భర్తను భార్యను హతమార్చిన తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది.

English summary
After becoming a mother of two children, a woman gave poison to her husband after he was accused of interfering with her illegal affair.According to a police report .. according to police report this crime was happened in moodu gudisela thanda in mahaboobabad district .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X