వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్‌కు ఝలక్, కారు దిగి ఏమిటని అడిగిన మంత్రి: ఈటెల చమత్కారం

|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు బుధవారం నాడు జనగామ జిల్లాలో ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ జిల్లాకు వెళ్తుండగా ఆయనను మూడు మండలాల ప్రజలు అడ్డుకున్నారు.

'రూ100 కోట్లకు పైగా మోసం చేసిన కాంట్రాక్టర్ ఎవరి స్నేహితుడు'

ఘనపూర్, జఫర్‌గడ్, చెల్పూర్ మండలాల ప్రజలు కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డగించారు. మూడు మండలాల ప్రజలు రోడ్డు పైన బైఠాయించారు. తమను జనగామ జిల్లాకు బదులు వరంగల్ అర్బన్ జిల్లాలో కలపాలని వారు డిమాండ్ చేశారు.

ప్రజలు కాన్వాయ్‌ను అడ్డగించడాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్ తన కారు నుంచి కిందకు దిగారు. నిరసన తెలుపుతున్న వారి వద్దకు వెళ్లి, విషయం అడిగి తెలుసుకున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో తాము అసంతృప్తిగా ఉన్నామని, తాము ఓ జిల్లా కావాలని కోరుకుంటే మరో జిల్లాలో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, జనగామ జిల్లా కోసం స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. వారి ఉద్యమ ఫలితంగా కేసీఆర్ మెట్టు దిగి జనగామను కూడా జిల్లాగా ఏర్పాటు చేశారు.

Locals obstruct Minister KTR's convoy

ఈటెలతో వినయ భాస్కర్ చమత్కారం

వరంగల్‌ నగరాభివృద్ధికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ సాయం చేయాలని వినయ భాస్కర్‌ చమత్కరించారు. దానికి ఈటెల బదులిస్తూ.. కొత్త జిల్లాల ఏర్పాటులో తన సొంత మండలం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కలిసిందని, ఇప్పుడు కుడా పరిధిలోకి వచ్చింది కాబట్టి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేయడానికే ఇక్కడికి వచ్చానని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి.

కాగా, కాకతీయ పట్టణాబివృద్ధి సంస్థ చైర్మన్‌గా మర్రి యాదవ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.

English summary
Locals obstruct Minister KT Rama Rao's convoy in Janagama district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X