వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ ఉభయసభల్లో ఎంపీల ఆందోళన, రేపటికి వాయిదా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నాడు వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఉభయ సభల్లో పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తమ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాలని ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఏపీ రాష్ట్రాన్ని ఆదుకోవాలని టిడిపి ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు.

పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత టిడిపి ఎంపీలు పార్లమెంట్ వెలుపల ఆందోళన కొనసాగించారు. . ఏపీని ఆదుకోవాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లోనూ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తర సమయం కొనసాగుతుండగా తెలుగు ఎంపీలు ఫ్లకార్డులతో పొడియం ముందుకు దూసుకు వెళ్లి నిరసన తెలిపారు

దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది.

Lok Sabha Proceedings Stalled For Sixth Consecutive Day Amid Multiple Opposition Protests

సోమవారం ఉదయం సభా సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు నినాదాలతో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

ముందుగా ప్రత్యేక హోదాపై స్పందించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కాలింగ్‌ అటెన్షన్‌ నోటీసు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే సభ్యులు ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు.

ఇక లోక్‌సభలోనూ ఇదే తరహా సన్నివేశం చోటు చేసుకుంది. నినాదాలు చేస్తూ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లటంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తెలిపారు.ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడ తమ రాష్ట్రాల్లోని సమస్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనకు దిగారు.

Lok Sabha Proceedings Stalled For Sixth Consecutive Day Amid Multiple Opposition Protests

సంగీత కళాకారుడిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసన
సంగీత కళాకారుడిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంగీతం రాళ్ళను కూడ కరిగిస్తోందని చెబుతారని శివప్రసాద్ గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తన సంగీతం ద్వారా మోడీ మనసును కరిగించాలనే ఉద్దేశ్యంతోనే ప్రయత్నిస్తున్నట్టు శివప్రసాద్ చెప్పారు.

English summary
The Lok Sabha proceedings were adjourned this morning for an hour as parties continued their protests over various issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X