ప్రేమించి మోసం చేశాడు: ట్రైనీ ఐఏఎస్, మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు

హైదరాబాద్: తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో ట్రైనీ ఐఏఎస్ బానోత్ మృగేందర్ లాల్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుమారుడే ఈ మృగేందర్ లాల్. ప్రస్తుతం మదురైలో ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో మృగేందర్‌లాల్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.

Love fraud: A case registered against trainee IAS mrugender lal

పెళ్లికి మృగేందర్‌లాల్ నిరాకరిస్తున్నాడని, తన కుమారుడిని వదిలేయాలని ఆయన తండ్రి బెదిరిస్తున్నారని యువతి ఆరోపించారు. రూ. 25 లక్షలు డబ్బు కూడా ఆశ చూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐఏఎస్‌పై కేసు నమోదైంది. అయితే, ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

8 కిలో గంజాయి పట్టివేత
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టుపడింది. ఓ ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ-హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో నార్కట్‌పల్లి పోలీసులు తనిఖీ చేశారు. తరలిస్తున్న గంజాయితోపాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ దొంగ వ్యాపారం మాత్రం ఆగడం లేదు.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand

    కాగా, తెలంగాణలో డ్రగ్స్ అనేదే ఉండకూడదని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఎంత పెద్దవారున్నా.. విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇక గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం పిలుపునిచ్చారు. గంజాయి కట్టడి చేసిన అధికారులకు నగదు బహుమతులు, ప్రత్యేక పదోన్నతులు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేగాక, గంజాయిని సాగు చేసే రైతులకు రైతుబంధు, రుణమాఫీ లాంటి రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+