హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ పేరుతో మోసం: ఇద్దరు యువతులను పెళ్లాడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమ పేరిట ఇద్దరు యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో పాటు అతడికి సహకరించిన తండ్రిని ఛత్రినాక పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌ గాయత్రీనగర్‌కి శంకర్‌ నాయక్‌ కుమారుడు రమావత్‌ కిరణ్‌కుమార్‌(27) హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

ఉప్పుగూడకు చెందిన పుష్పలత(24)ను ప్రేమించి 2013లో బాలాపూర్‌ సాయిబాబా ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. కిరణ్‌కుమార్‌ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతోఅమ్మాయి తల్లిదండ్రులే వివాహం జరిపించారు.

Love fraud: A techie arrested in Hyderabad

సైదాబాద్‌లో కాపురం పెట్టిన ఈ జంటకు కుమారుడు(1) ఉన్నాడు. కాగా, కిరణ్‌కుమార్‌ బీటెక్‌లో తన సహ విద్యార్థిని అయిన గౌలిపురా శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్వాతి(25)తో ఐదేళ్లుగా ప్రేమ కొనసాగిస్తున్నాడు.

తన పెళ్లి విషయం దాచిపెట్టిన కిరణ్.. నిరుడు జూన్‌ 17న సీతారాంబాగ్‌లోని ఆర్యసమాజ్‌లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు కిరణ్‌ తండ్రి శంకర్‌నాయక్‌(45), కుటుంబసభ్యులు సహకరించారు.దీంతో మొదటి భార్య పుష్పలత గత నవంబరు 27న ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనను భర్త కిరణ్‌కుమార్‌, అతడి కుటుంబం అదనపు కట్నంకోసం వేధించారని పేర్కొంది. విచారణలో రెండోపెళ్లి విషయం తెలియడంతో మంగళవారం అతడిని, శంకర్‌నాయక్‌నూ అరెస్ట్‌ చేశారు. తల్లి, సోదరులపై కేసులు నమోదు చేశారు. కాగా, కిరణ్ కుమారు తల్లి, అన్న, తమ్ముడు పరారీలో ఉన్నారు.

English summary
A techie has been arrested in Hyderabad on Tuesday for allegedly marrying two girls with fraud promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X