లలిత జ్యువెల్లరీ చోరీ కేసులో ప్రేమ పక్షులు: ఎలా చేశారంటే...

Recommended Video

    లలిత జ్యువెల్లరీ చోరీ కేసులో ప్రేమ పక్షులు

    హైదరాబాద్: హైదరాబాదులోని పంజగుట్ట పరిధిలో గల సోమాజిగూడ సర్కిల్‌లో ఉన్న లలితా జ్యువెలర్స్‌ సంస్థలో గత సోమవారం జరిగిన రెండో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రేమజంటను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

    వీరు జ్యువెలర్స్‌లో దొంగిలించిన సొత్తును తమ స్వస్థలానికి తీసుకెల్లి అక్కడున్న ఓ ఫైనాన్స్‌ సంస్థలో కుదువ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో ఆ బంగారం రికవరీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుంది.

    ప్రేమికులు ఇలా చోరీ.

    ప్రేమికులు ఇలా చోరీ.

    ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కరీముల్లా, వాణి ఉపాధి కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్ నగరానికి వలసవచ్చారు. సికింద్రాబాద్‌ సింథికాలనీలోని బాయ్స్, గర్ల్స్‌ హాస్టల్స్‌లో నివసిస్తున్న వీరిద్దరూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రేమజంట సులభంగా డబ్బు సంపాదించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే వీరి దృష్టి సోమాజిగూడ చౌరస్తాలో ఉన్న లలితా జ్యువెలర్స్‌పై పడిందని అంటున్నారు.

    వారు ఇలా చోరీ చేశారు...

    వారు ఇలా చోరీ చేశారు...

    గత సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో ప్రేమికులు ఇరువురు జ్యువెలర్స్‌కు వచ్చారు. బంగారు ఆభరణాల కోసం ఆరా తీస్తూ దుకాణం మొదటి అంతస్తులోకి చేరుకున్నారు. అక్కడున్న రద్దీని తమకు అనువుగా మార్చుకున్నారు.వివిధ రకాలైన ఆభరణాలు చూపించమంటూ సేల్స్‌మెన్‌ దృష్టిని మళ్ళించారు. అదును చూసుకుని అక్కడి కౌంటర్‌లో ఉన్న రెండు జతల బంగారు గాజులు (55.3 గ్రాములు), ఓ బ్రాస్‌లెట్‌ (10.7 గ్రాములు) ఎత్తుకుపోయారు. ఆ రోజు దుకాణం మూసే సమయంలో స్టాక్‌ సరి చూసినప్పుడు తేడా కనిపించింది.

    మర్నాడు మాయమైనట్లు గుర్తించి...

    మర్నాడు మాయమైనట్లు గుర్తించి...

    మంగళవారం పూర్తిస్థాయి ఆడిటింగ్ నిర్వహించిన యాజమాన్యం 66 గ్రాముల బరువుతో ఉన్న ఐదు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ జంట వ్యవహారం బయటపడింది. దీని ఆధారంగా బుధవారం సంస్థ ప్రతినిధి జి.మధుసూదన్‌ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌లతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. నిందితుల్ని గుర్తించిన పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

    సొత్తును తాకట్టు పెట్టారు..

    సొత్తును తాకట్టు పెట్టారు..

    చోరీ సొత్తును కరీముల్లా నందిగామలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో రూ.1.2 లక్షలకు తాకట్టు పెట్టినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ సొత్తు రికవరీ చేయడానికి పంజగుట్ట పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

    కోఠీ చోరీ కేసు ఇలా...

    కోఠీ చోరీ కేసు ఇలా...

    పంజగుట్ట బ్రాంచ్‌లో దొంగతనం జరగడానికి ముందే ఈ నెల 3న లలితా జ్యువెలర్స్‌లో ఓ దొంగతనం జరిగింది. బురఖా ధరించిన వచ్చిన ఇద్దరు స్త్రీలు రూ.6 లక్షల విలువైన 20 తులాల బంగారు నెక్లెస్‌ను ఎత్తుకెళ్ళారు. సేల్స్‌మెన్‌ దృష్టి మళ్ళించి బంగారు నెక్లెస్‌ స్థానంలో రోల్డ్‌గోల్డ్‌ నగ పెట్టారు. దీన్ని బట్టి ఆ నిందితులు అంతకు ముందే షోరూమ్‌కు వచ్చి ఉంటారని, అప్పడే ఫొటో తీసుకుని వెళ్ళి రోల్డ్‌గోల్డ్‌ది తయారు చేయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ప్రయాణించిన ఆటో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

    ఆటో డ్రైవర్‌ను విచారించిన పోలీసులు..

    ఆటో డ్రైవర్‌ను విచారించిన పోలీసులు..

    ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. ఆ రోజు బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు కోఠిలో ఉన్న ఆంధ్రాబ్యాంకు కూడలివద్ద తన ఆటో ఎక్కినట్లు చెప్పాడు. దీంతో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లు సేకరించిన పరిశీలించారు. వీటిలో ఎలాంటి ఆధారం లభించలేదు. ఆ ఆటో వెళ్ళిన మార్గంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పాటు వీరి ఎక్కిన ప్రాంతంలో లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+