భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి లాడ్జీకి, విషం తాగి, చివరికిలా....

Posted By:
Subscribe to Oneindia Telugu

సంగారెడ్డి:భర్తతో కొంతకాలంగా సఖ్యత లేదు. అదే సమయంలో గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి ఆమె ఇంటినుండి పారిపోయింది.అయితే చివరకు ప్రియుడితో కలిసి ఆమె ఆత్మహత్యయత్నం చేసింది.అయితే చివరినిమిషంలో 108 ఫోన్ చేయడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి అదే గ్రామానికి చెందిన శిరీషతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నారు.

lovers suicide attempt in sangareddy district

ఈ క్రమంలో శిరీషకు ఆమె భర్త యాదయ్యకు మద్య విబేధాలు వచ్చాయి.వారికి ఇద్దరు పిల్లలున్నారు. దీంతో శిరీష ఆమె ప్రియుడు అనిల్ రెడ్డితో కలిసి రెండు రోజుల క్రితం సంగారెడ్డికి వచ్చారు.

శిరీష తనభర్తకు సమాచారం ఇవ్వకుండానే వచ్చేసింది. సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లిలోని లాడ్జీలో వారు బస చేశారు.

జీవితంపై విరక్తి చెందిన సోమవారం నాడు మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.అయితే చివరకు ఏమనుకొన్నారో ఏమో 108 కు ఫోన్ చేశారు.

సమాచారం అందుకొన్న పోలీసులు లాడ్జికి చేరుకొన్నారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకొన్న అనిల్ రెడ్డి, శిరీషను చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ ఐ శివలింగం చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
lovers suicide attempt in sangareddy district on monday.anilreddy illegal affair with sirisha.they escape two days back from cheekurthy village.
Please Wait while comments are loading...