తలసానికి తప్పిన ప్రమాదం, సాక్షిపై ఎర్రబెల్లి ప్రశ్న

 Lucky escape for MLA Talasani
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని తొండిపల్లి బ్రిడ్జి వద్ద సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో జరిగే సదర్‌ కార్యక్రమంలో పాల్గొ నేందుకు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కారులో బయలుదేరారు.

మార్గమధ్యలో తొండిపల్లి బ్రిడ్జివద్ద ఎమ్మెల్యే కారును ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీ కొట్టింది. వెనుక వస్తున్న మరో కారు ఇన్నోవాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

సాక్షిని ఆపలేదేం: కేసీఆర్‌కు ఎర్రబెల్లి

తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేయించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సాక్షి ప్రసారాలను మాత్రం ఎందుకు నిలిపివేయలేదని తెలంగాణ టీడీపీ నేత నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం నాడు ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్‌కు సంబంధాలు ఉన్నాయా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా తీవ్ర కష్టాలకు గురవుతున్నారన్నారు.

మావోయిస్టు అజెండా పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్, చివరకు మావోయిస్టులను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగుతోందన్నారు. ఐదు నెలల క్రితమే ఛత్తీస్ గఢ్‌కు కేసీఆర్ వెళ్లి ఉంటే రైతుల ఆత్మహత్యలు ఉండకపోయేవని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+