• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రెండుగా "మా" చీలిక-ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామా..? ఆల్‌తెలుగు "మా" ఏర్పాటు దిశగా అడుగులు..?

|

హైదరాబాదు: "మా" రెండుగా చీలనుందా..? మంచు విష్ణు నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరబోతోందా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా జరిగిన "మా" ఎన్నికల్లో విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తనపైన గెలిచిన విష్ణును ప్రకాష్ రాజ్ అభినందించారు. తెలుగు బిడ్డ గెలుపుగా అభివర్ణించారు. కానీ "మా" అధ్యక్షుడిగా విష్ణు ఉండడాన్ని ప్రత్యర్థి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో తిరుగుబావుటా జెండా ఎగురవేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామా..?

ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామా..?

"మా" ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో పాటుగా ఓడిపోయిన సభ్యులు సైతం మూకుమ్మడిగా "మా"కు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విష్ణు గెలవగానే తొలుత మెగా బ్రదర్ నాగబాబు రాజీనామాస్త్రం ప్రయోగించారు. ఆ వెంటనే ప్రకాష్ రాజ్ అదే బాట పట్టారు. ప్రాంతీయ వాదం జాతీయ వాదం పేరుతో గెలిచిన "మా"లో తాము సభ్యులంగా ఉండలేమని ఇద్దరూ స్పష్టం చేశారు. విష్ణును గెలిపించడం ద్వారా సభ్యులు సైతం ప్రాంతీయవాదానికే ఓటేశారనే అభిప్రాయం తెరపైకి తీసుకొచ్చారు.

నరేష్ హయాంలో అవకతవకలపై విచారణ

నరేష్ హయాంలో అవకతవకలపై విచారణ


ఇదే సమయంలో శివాజీ రాజా ఎంటర్ అయ్యాడు. నరేష్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణకు డిమాండ్ చేశారు. విష్ణు గెలుపు వెనక నరేష్ ఉండటం, ఇప్పుడు విష్ణు అధ్యక్షుడు అయ్యాక నరేష్ పెత్తనం కొనసాగుతుందనే అభిప్రాయం ప్రకాష్ రాజ్ మద్దతుదారుల్లో బలంగా వినిపిస్తోంది. ప్రాంతాలు భాషలతో సంబంధం లేకుండా ఉండే కళాకారుల మధ్య ప్రాంతీయభావం తెచ్చారంటూ ప్రకాష్ రాజ్ శిబిరం మండిపడుతోంది. విష్ణు నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేనివారంతా రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

 ఏపీ తెలంగాణ

ఏపీ తెలంగాణ "మా" ఏర్పాటు..?


ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఓట్ల లెక్కింపు తర్వాత రోజు ఫలితాల వెల్లడిలో వచ్చిన విజేతల పేర్లు తేడాగా ఉన్నాయనేది మరో ఆరోపణ. అందుకు ఉదాహరణగా అనసూయ ఓటమి అంశాన్ని ప్రకాష్ రాజ్ టీమ్ ప్రస్తావిస్తోంది. కొంతమంది ఓట్లు తీసుకుని బయటకు వెళ్లారనే ఆరోపణలు సైతం తెరమీదకు వచ్చాయి. దీంతో విష్ణు బాధ్యతల స్వీకరణకు ముందే వ్యతిరేకులంతా ఒక్కటై మరో "మా"ను ఏర్పాటు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆంధ్ర తెలంగాణ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ పేరుతో దానిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే నాగబాబు- ప్రకాష్ రాజ్ ముందస్తుగానే "మా" సభ్యత్వానికి రాజీనామా చేశారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఏం జరగబోతోంది...?

ఏం జరగబోతోంది...?


తన రాజీనామాతోనే అంతా అయిపోలేదని ఇంకా చాలా ఉందంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సైతం తాజా పరిణామాలకు ఊతమిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై మోహన్‌ బాబు అండ్ టీమ్ వేచిచూసే ధోరణితో ఉండగా... మెగా క్యాంప్ పూర్తిగా కామ్ అయిపోయింది. దీంతో సాయంత్రం ప్రకాష్ రాజ్ టీమ్ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు.. వారు ఏం ప్రకటన చేస్తారనేది ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు కామన్ పబ్లిక్‌లోను ఉత్కంఠకు కారణమవుతోంది. చీలిక అనివార్యమైతే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారు వారి విషయంలో ఏ జరగబోతోందనేది మరో ఆసక్తికర అశం. నిజంగానే "మా"లో చీలిక వచ్చి కొత్తగా ATMA ఏర్పడితే ఇప్పటి దాకా తెరముందుకు వచ్చి సూక్తులు చెప్పిన టాలీవుడ్ పెద్దలు ఏం చేస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. వీటన్నిటికీ మంగళవారం రాత్రికి ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
After a heated MAA election and Vishnu panel win, Prakash Raj team is all set to resign to the Primary membership of MAA and start a AP Telangana MAA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X