హైదరాబాద్ లో గణేష్ అన్నదానం వద్ద బీఫ్ ముక్కలు కలకలం..! తీవ్ర ఉద్రిక్తత..

హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన గణేష్ నిమజ్జనాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఓల్డ్ సిటీ పరిధిలోని మాదన్నపేట్ లో నిర్వహించిన గణేష్ అన్నదానం కార్యక్రమంలో తీవ్ర అపచారం జరిగింది. మాదన్నపేట్ పీఎస్ పరిధిలోని 2 బీహెచ్ కే హౌజింగ్ సొసైటీ వద్ద నిర్వహించిన గణేష్ అన్నదానంలో గుర్తు తెలియని వ్యక్తులు మాంసం వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకు దిగారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే నేతృత్వంలో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

అయితే అదే హౌజింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనా అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం నిందితుల్ని రిమాండ్‌ కు తరలిస్తున్నామని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని డీసీపీ కిరణ్ ఖరే స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనతో స్థానికులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి తరలివచ్చి ఆందోళన చేశారు. మతపరమైన ప్రదేశాల్లో నాన్ వెజ్ పదార్థాలను పడేయడం తమ భావోద్వేగాలను దెబ్బతీయడమేనని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Madannapet at Ganesh Annadanam Miscreants threw meat from above during the high tension prevailed

అయితే వారితో మాట్లాడి పరిస్థితిని సామరస్యంగా సద్దుమణిగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ యథాతథంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో ఈ మేరకు ఎలాంటి పుకార్లు నమ్మొద్దని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ప్రచారం చేయొద్దని వివరించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+