నమస్తే మోడీజీ, నమస్తే ఇవాంకా ట్రంప్: జీఈఎస్‌లో' మిత్ర' రోబోల పలకరింపు
జీఈఎస్ 2017 సమ్మిట్‌కు హజరయ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 'మిత్ర' స్వాగతం పలుకనుంది.
Recommended Video

హైదరాబాద్: జీఈఎస్ 2017 సమ్మిట్‌కు హజరయ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 'మిత్ర' స్వాగతం పలుకనుంది.పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రోబోకు 'మిత్ర అని పేరు పెట్టారు.
ప్రపంచ పెట్టుడిదారుల సదస్సు 2017 ప్రపంచంలోని 120 దేశాల నుండి సుమారు 1600 మంది ప్రతినిధులు హజరుకానున్నారు.ఈ ప్రతినిధుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు.
అయితే ఇవాంకా ట్రంప్, మోడీ లాంటి వివిఐపిలు, విఐపిలు ఈ సదస్సుకు హజరుకానున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలపైనే ఈ సదస్సు ఫోకస్ చేయనుంది.

ఇవాంకా ట్రంప్, మోడీకి రోబో స్వాగతం
నమస్తే నరేంద్రమోదీజీ.. నమస్తే ఇవాంకా ట్రంప్' అంటూ ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు హాజరుకాబోతున్న ప్రధాని మోదీని, ఇవాంకలకు ‘మిత్ర' స్వాగతం పలుకబోతుంది. హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరిస్తుంది. బెంగళూరుకు చెందిన బాలాజీ విశ్వనాథన్ పూర్తి స్వదేశీ విజ్ఞానంతో ఈ రోబోను తయారు చేశారు.

జీఈఎస్ ప్రాంగంణంలో రెండు రోబోలు
హైదరాబాద్‌లో జరగనున్న జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడ రెండు ‘మేడిన్ ఇండియా' రోబోలను విశ్వనాథన్ బృందం ప్రదర్శనకు పెట్టింది.
ఈ రెండు బోట్లలో ఒకటి వేదిక మీద విదేశీ పారిశ్రామిక ప్రముఖులతో ముచ్చటిస్తుంది. మరొక రోబో వేదిక బయట ప్రేక్షకులతో ముచ్చటిస్తుంది.

పాట పాడనున్న రోబో
ప్రధాని మోదీ, ఇవాంక వేదిక మీదకు రాగానే మిత్ర వారి వద్దకు వెళ్లి.. వారితో సంభాషిస్తుంది. వాళ్లు ఒక బటన్ ప్రెస్ చేస్తారు. దీంతో మిత్ర పాట పాడుతుంది.శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైనట్టు డిక్లేర్ అవుతుందని విశ్వనాథన్ తెలిపారు.

1500 శిక్షణ ప్రక్రియలు
మా ‘మేడిన్ ఇండియా' రోబోట్లను ప్రదర్శించడానికి జీఈఎస్‌ను ఆదర్శ వేదికగా మేం భావిస్తున్నాం. ఈ సదస్సుకు అత్యంత ప్రముఖులు వస్తుండటం, కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో మిత్ర వేదిక మీద కొద్దిసేపు మాత్రమే ముచ్చటిస్తుందని విశ్వనాథన్ తెలిపారు.. ఇప్పటికే ఈ రోబోలకు 1000-1500 శిక్షణ ప్రక్రియలను నిర్వహించామన్నారు విశ్వనాథన్.

హైద్రాబాద్ నుండి ఇవాంకా ట్రంప్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ నుండి ట్వీట్ చేశారు. ఉదయం 10.22 గంటలకు ఆమె భాగ్యనగరం నుంచి తొలి ట్వీట్ చేశారు. "అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు. హైదరాబాదులో ఉండటం పట్ల ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నా" అంటూ ట్విట్టర్ ద్వారా ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ... ఇవాంకా ట్రంప్ ట్వీట్ కు ప్రతిస్పందించారు. 'వెల్ కమ్ టు ఇండియా' అంటూ ట్వీట్ చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications