300 మంది మహిళలను వశపరుచుకున్న మధు అరెస్టు
హైదరాబాద్: ఫేస్‌బుక్‌ను వాడుకుంటూ పెద్ద యెత్తున మహిళలకు ఎర వేసి వారిని వశపరుచుకుంటున్న కామాంధుడు మధు పోలీసుల చేతికి చిక్కాడు. ఎఫ్‌సీఐలో గతంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసిన మధు అనే వ్యక్తి అమ్మాయిలను ట్రాప్ చేసి వంచించినట్లుగా గుర్తించారు. అతనిపైన ఆరోపణలు రావడంతో అప్పుడే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
మధు పలువురు మహిళలను ట్రాప్ చేసి వంచిస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 300 మంది వరకు మహిళలు, అమ్మాయిలను అతను వంచించినట్లుగా తెలుస్తోంది. మరో 500 మంది మహిళలను అతను వేధిస్తున్నట్లు వెలుగు చూసింది. తనకు లొంగని అమ్మాయిలను వేధించేవాడు.

నల్గొండ జిల్లాకు చెందిన మధు పైన సిసిఎస్‌లో కేసు నమోదయింది. అమ్మాయిలను వేధించేందుకు నిందితుడు మధు పుస్తకంలో డేటా మెయింటెన్ చేస్తున్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఫేస్‌బుక్‌ను వాడుకుంటూ అమ్మాయిల ఫోన్ నెంబర్ల సంపాదించి వారిని వేధిస్తూ వచ్చాడు.
అమ్మాయిలను వేధించిన మధును పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతను వాడిన సెల్‌ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోచింగ్ పేరుతో అతను అమ్మాయిల కాల్ డేటాను సేకరించేవాడని విచారణలో తేలింది. దాదాపు 800 మంది అమ్మాయిల డేటా అతని వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన మధు కెరియర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని స్థాపించాడు. కన్సల్టెన్సీ కోసం వచ్చే అమ్మాయిల ఫోన్ నెంబర్లను, ఫేస్‌బుక్ ఐడీలను సేకరించాడు. అందులో కొంతమంది యువతులను వేధించడం మొదలు పెట్టాడు. అతడి వేధింపులు భరించలేక కొందరు అమ్మాయిలు ‘షీ'టీమ్‌ను ఆశ్రయించారు.
కేసుపై దర్యాప్తు చేపట్టిన షీ-టీమ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో మధు ఆగడాలను వెలుగులోకి తెచ్చారు. అతడికి మూడు ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతడి ఫేస్‌బుక్ చాటింగ్ లిస్ట్‌ను పరిశీలించామని, దాదాపు 300 మంది యువతులతో మధు చాటింగ్ చేశాడని, చాలామంది అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్‌లు పంపించాడని పోలీసులు చెప్పారు. అతడు వాడిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుని, పీడీ యాక్ట్ కింద అతడిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications