‘ఇది గెలుపు రూపాయి’: ఆ పెద్దావిడ కాళ్లకు మొక్కిన మాజీ స్పీకర్ చారి, కంటతడి
భూపాలపల్లి: తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీఆర్ఎస్ నేత సిరికొండ మధుసూదనాచారి బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎంపేడు, వెల్లంపల్లి, బండ్లపల్లి ప్రాంతాల్లో పర్యటించారు.

పెద్దావిడ పలకరింపు..
ఆ తర్వాత కుందనపల్లిలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి కొద్దిసేపు అక్కడ సేద తీరారు. ఈ సమయంలో అక్కడకు రాజమల్లవ్వ(70)అనే పెద్దావిడ చేరుకుంది. మధుసూదనాచారి ఆ పెద్దావిడను పలకరించారు.
మళ్లీ గెలవాలంటూ..
రాజమల్లవ్వ స్పందిస్తూ.. తన చేతిలోని ఒక్క రూపాయి నోటను మధుసూదనాచారి చేతిలో పెట్టింది. ‘ఇది నీ ఎన్నికల కోసం ఇస్తున్నా.. చందా అనుకో. నీ పేరు మీద దేవుడికి ముడుపు కూడా కడుతున్నా. నువ్వు మళ్లీ గెలవాలని మొక్కుతున్నా' అని ఆ పెద్దావిడ చెప్పింది.

కంటతడి పెడుతూ.. భావోద్వేగానికి గురైన చారి
ఈ క్రమంలో మధుసూదనాచారి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ‘నీలాంటి వాళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తల్లీ..' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ పెద్దావడి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
గెలుపు రూపాయంటూ..
అంతేగాక, ఆమె ఇచ్చిన రూపాయి నోటును జేబులో దేవుడి ఫొటోలతోపాటు జాగ్రత్తగా ఉంచుకుంటానని మధుసూదనాచారి తెలిపారు. ఈ రూపాయి తన గెలుపునకు గుర్తుగా మిగిలిపోతుందని ఉద్వేగంతో వ్యాఖ్యానించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications