వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధుయాష్కీ ఒక పొలిటికల్ టూరిస్ట్; కవితను విమర్శించే హక్కు లేదు: ఎమ్మెల్సీ గంగాధర్‌ గౌడ్‌

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేయగా కవిత ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. మధు యాష్కీ చేసిన వ్యాఖ్యలకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ వుల్లోల గంగాధర్ గౌడ్ రివర్స్ ఎటాక్ చేశారు.

 రేవంత్ రెడ్డి, మధుయాష్కీ లది ఐరన్ లెగ్: వుల్లోల గంగాధర్ గౌడ్

రేవంత్ రెడ్డి, మధుయాష్కీ లది ఐరన్ లెగ్: వుల్లోల గంగాధర్ గౌడ్

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ వుల్లోల గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ మధుయాష్కీ గౌడ్ కు ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. మధుయాష్కిగౌడ్ ఒక పొలిటికల్ టూరిస్ట్ అంటూ గంగాధర్ గౌడ్ విమర్శలు చేశారు. మధుయాష్కికి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి బిజెపితో కుమ్మక్కయ్యారని అందుకే డిపాజిట్ కూడా దక్కలేదని గంగాధర్ గౌడ్ మధుయాష్కీ గౌడ్ ను విమర్శించారు.

రేవంత్ రెడ్డి, మధుయాష్కీ లది ఐరన్ లెగ్ అని పేర్కొన్న గంగాధర్ గౌడ్, మధుయష్కిగౌడ్ ఎంపీగా ఉన్న సమయంలోనే షుగర్ ఫ్యాక్టరీ ని ప్రైవేటుపరం చేశారని పేర్కొన్నారు.

పసుపు బోర్డు గురించి అరవింద్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు.. దానిపై మాట్లాడు

పసుపు బోర్డు గురించి అరవింద్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు.. దానిపై మాట్లాడు

పసుపు బోర్డు కోసం కేంద్రంలో ప్రభుత్వం లేకున్నా ముఖ్యమంత్రితో లేఖలు రాయించిన ఘనత ఎమ్మెల్సీ కవితదని ఆయన వెల్లడించారు. మధుయాష్కి సపోర్ట్ చేసిన ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ తీసుకొని మళ్లీ మోసం చేశాడని, దాని గురించి మాట్లాడు అంటూ గంగాధర్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోసారి ఎమ్మెల్సీ కవితపై మాట్లాడితే నిజామాబాద్ లో ప్రజలు మిమ్మల్ని బయట తిరగనివ్వరు అని గంగాధర్ గౌడ్ తేల్చి చెప్పారు.

పసుపు బోర్డు.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీలపై కవితపై మధుయాష్కీ టార్గెట్

పసుపు బోర్డు.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీలపై కవితపై మధుయాష్కీ టార్గెట్


అంతకు ముందు కల్వకుంట్ల కవితకు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. చెల్లె .. కల్వకుంట్ల కవిత 2014లో ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని చెప్పి మొత్తానికి మొత్తంగా మూసేసి రైతులకు, కార్మికులకు పంగనామాలు పెడితివి. పసుపు బోర్డు తెస్తాను... ఫ్యాక్టరీ ప్రభుత్వపరం చేస్తానన్న నమూనాలోనే మీ ఎంపీలు ధర్నా డ్రామాలు చేస్తున్నారు చెల్లె అంటూ మధుయాష్కిగౌడ్ ఎద్దేవా చేశారు.

కవితకు మధు యాష్కీ కౌంటర్

కవితకు మధు యాష్కీ కౌంటర్

కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఎన్నడు ధాన్యం కొనుగోలు సమస్య రాలేదని పేర్కొన్న మధుయష్కిగౌడ్ మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో లేని సమస్య తెలంగాణలో ఎందుకు ఉంది అంటూ ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి, కల్లాలలో ధాన్యం గింజలపై ప్రాణాలు వదిలేస్తున్న పేద రైతుల ప్రాణాలు కాపాడు అంటూ మధుయాష్కిగౌడ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ పోస్ట్ తో ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల దాడి కొనసాగుతుంది.

English summary
TRS MLC Vullola Gangadhar Goud said that Madhuyashki Goud has no right to criticize MLC Kavitha. Gangadhar Goud criticized Madhuyashki Goud as a political tourist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X