తెలుగు విశ్వవిద్యాలయంలో ఇంద్రజాలం కోర్సు (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2014-2015 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సులను ప్రవేశపెట్టినట్టు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉన్న తెలుగుభాష, సాహిత్యం, సంస్కతి, చరిత్ర, జ్యోతిషం, జర్నలిజం, సంగీతం, నత్యం, రంగస్థల కళలు, చిత్రలేఖనం, శిల్పకళలతోపాటు ఈ ఏడాది నుంచి కొత్తగా ఇంద్రజాలం కోర్సును ప్రవేశపెడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి, వరంగల్ ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కే ఆశీర్వాదం ప్రకటించారు. ఆసక్తి కలవారు ఈ నెల 8 గురువారం నుంచి విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.teluguuniversity.ac.in నుంచి దరఖాస్తు నమూనాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

దీనితో పాటు యూనివర్సిటీ క్యాంపస్‌లలోనూ నేరుగా దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 30లోగా సమర్పించాలని ఆయన తెలిపారు.













Click it and Unblock the Notifications