ఐమ్యాక్స్ థియేటర్‌లో 'మహా పెయింటింగ్'(ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం కాన్వాస్ అయింది. నగర ప్రజలు ఆర్టిస్టులయ్యారు. వినూత్న తరహాలో రూపుదిద్దుకున్న "మహా పెయింటింగ్"కు రంగులు దిద్దారు. హైడొ రైట్ కార్యక్రమంలో భాగంగా రూపొందుతున్న 32 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న పెయింటింగ్ చిత్రీకరణలో 144 మంది నగర ప్రజలు పాల్గొనేందుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు.
అలా పెయింట్ వేసేందుకు వచ్చిన వారికి అవసరమైన రంగులతో పాటు సూచనలు అందిస్తోంది ప్రముఖ చిత్రకారుడు కాంత్ రిసా బృందం. ఐమ్యాక్స్ థియేటర్‌లో బుధవారం మూడు రోజుల సన్నాహక కార్యక్రమం ప్రారంభించారు. పొడవైన వస్త్రంపై 140 గడుల్లో ఒక్కో చిత్రకారుడు చిత్రాలు వేశారు. ఇలా మూడు రోజుల పాటు చేయనున్నారు.

తొలిరోజున చిత్రకారులుగా మారిన వారిలో ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఈఓ వి.బి గాడ్గిల్, ప్రసాద్ గ్రూప్ సీఎండీ రమేష్ ప్రసాద్, సినీ నటుడు కమల్ కామారాజు, కూచిపూడి నృత్య కారిణి యామినీ రెడ్డి, ఫిక్కీ ప్రతినిధి పార్వతీ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ పెయింటింగ్ కార్యక్రమం గురు, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా కొనసాగుతుందని హైడోరైట్ ప్రతినిధులు ఎ.వి.రామకృష్ణ, మనోజ్, కెప్టెన్ ఆనంద్‌లు చెప్పారు. ఈ మహాచిత్రాన్ని ఈ నెల 15న హైడొరైట్ తొలి కార్యక్రమంలో ఆవిష్కరిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications