తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ.. రూ. 26.49 కోట్లతో.. ఆ రైళ్లన్నీ ఇక్కడి నుంచే..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమృత్ భారత్ పథకంతో దేశంలోని అనేక పురాతనమైన రైల్వే స్టేషన్లు సరికొత్తగా మారుతున్నాయి. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 40 రైల్వే స్టేషన్లు ఎంపికైన విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికే 12 రైల్వే స్టేషన్ల పనులు ముగిశాయి. మిగతా రైల్వే స్టేషన్లలో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్, బేగంపేట, కరీంనగర్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
మహబూబాబాద్ రైల్వే స్టేషన్
— G Kishan Reddy (@kishanreddybjp) September 2, 2025
తెలంగాణలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద పునరాభివృద్ధి పనులు ముగించుకుని అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి రానుంది.
ముఖ్యాంశాలు:
💰 ప్రాజెక్టు వ్యయం: ₹26.49 కోట్లు
📊 పని స్థితి: 92% పూర్తి pic.twitter.com/u1rnw74Iz4
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయని.. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 26.49 కోట్లు ఖర్చు చేసిందని.. పనులు 92 శాతం పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ త్వరలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు స్టేషన్ లో కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనం, వేచి ఉండే గదుల నిర్మాణాలు. ఇతర భవనాల చిత్రాలను ఎక్స్ లో పోస్టు చేశారు. తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం అనేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ లోని సికింద్రాబాద్/నాంపల్లి స్టేషన్ లకు రోజుకు 14 నుంచి 16 రైళ్లు సౌకర్యం కల్పిస్తున్నాయి. వీటిలో అన్ని రకాల రైళ్లు ఉన్నాయి. దీంతో ఈ రైళ్లను ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార ప్రయాణికులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అలాగే విజయవాడ వైపు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 17-18 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ వైపు నిత్యం 17 నుంచి 18 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు రవాణా మరింత బలోపేతం కానుంది.












Click it and Unblock the Notifications