బాబుకు రెండ్రోజుల్లో తెలుస్తుంది, రేవంత్ బలి: మహేందర్ సంచలనం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రానున్న రెండు రోజుల్లో కీలక పరిణామాలు సంభవించనున్నాయా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు సంభవిస్తాయని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గురువారం అన్నారు.
మరో రెండు రోజుల్లో ఏం జరగనుందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని చంద్రబాబు బలిపశువును చేశారని ఆయన మండిపడ్డారు.

రేవంత్ రెడ్డిని కేసులో ఎవరూ ఇరికించలేదన్నారు. చంద్రబాబు సలహా మేరకు, ఆయన చెప్పింది విని ఆయనే స్వయంగా ఇరుక్కున్నారన్నారు. హైదరాబాదులో ప్రజల మధ్య గొడవలు రేపి, తన పబ్బం గడుపుకోవాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు సెక్షన్ 8 కోసం డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.
ధర్మపురిలో కాంగ్రెస్ ధర్నా
కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఇందిరా గాంధీ విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం ధర్నా చేసింది. ఆ పార్టీ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications