తెలంగాణ కొత్త డీజీపీగా మహేందర్ రెడ్డి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా హైదరాబాద్ సీపీ ఎం మహేందర్‌రెడ్డిని నియమించారు. తెలంగాణ తొలి, ప్రస్తుత డీజీపీ అనురాగ్‌ శర్మ నవంబర్ 12న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా 1986 బ్యాచ్‌ అధికారి, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గుచూపింది.

 Mahender Reddy is new DGP

మహేందర్‌రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న అనురాగ్‌ శర్మను హోంశాఖ సలహాదారుగా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

మహేందర్ రెడ్డి స్థానంలో హైదరాబాద్‌ తాత్కాలిక సీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించారు. వీరి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Police Commissioner M. Mahender Reddy was appointed Director-General of Police (DGP) of Telangana on Friday. According to a release, Chief Minister K. Chandrasekhara Rao signed the orders.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి