Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mahesh Kumar Goud: తెలుగు కోడలైనా.. తెలంగాణపై ప్రేమ చూపలేదు..

Mahesh Kumar Goud: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు టీపీసీసీ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ బడ్జెట్ భారత్ బడ్జెట్ లాగా లేదని.. బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోసమే బీహార్ కు నజరానాలు ఇచ్చారని.. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందన్నారు.

50.65 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. త్వరలో బీహార్ లో ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్లో అందరికి సమానంగా ఇవ్వాలన్నారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు రాసిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సూక్తిని వినియోగించారని.. అయితే తెలంగాణలో ఉన్న వాళ్లంతా మనుషులు కాదా అంటూ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగారు.

Mahesh Kumar Goud Slams Union Budget 2025 No Love for Telangana

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేశారన్నారు. రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాష్ట్రం నుంచి రూ.40 వేల కోట్ల జీఎస్టీ నిధులు కేంద్రానికి వెళ్తున్నాయని.. ఆ మేరకు అయినా నిధులు తెలంగాణకు రావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వివక్ష చూపకూడదని.. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు సహకారం అందించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+