హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..ఊపిరాడక జనం పరుగులు..ఎక్కడంటే..?
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదట శేషసాయి కెమికల్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి విస్తరించాయి. దాంతో ఆ ప్రాంతంమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
రసాయన పరిశ్రమలో మంటలు అంటుకోవడంతో అక్కడున్న కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. దీంతో మంటలు ఫ్యాక్టరీలో భారీగా ఎగసిపడుతున్నాయి.మంటల ధాటికి ఫ్యాక్టరీలో ఉన్న రసాయన డ్రమ్ములు పేలిపోతున్నాయి. అగ్నిప్రమాద ప్రాంతం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది.

రసాయనాల నుంచి వచ్చే ఘాటైన పొగతో చర్లపల్లిలోని కెమికల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరై పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.అగ్నిప్రమాదం సంబవించడానికి గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications