తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!

తెలంగాణలో డీఏ సహా ఇతర బకాయిల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగులకు (employees) ప్రభుత్వం ఎట్టకేలకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఇవాళ అసెంబ్లీలో ఉద్యోగుల బకాయిలపై స్పందించిన ప్రభుత్వం.. వాటిని ఎప్పుడు క్లియర్ చేస్తుందన్న దానిపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగుల విషయంలో తాము తీసుకుంటున్న చర్యలతో పాటు బకాయిల అంశంపైనా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) ఓ ప్రకటన చేశారు.

తెలంగాణలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు డీఏ బకాయిలను గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని, వాటిని త్వరలోనే చెల్లిస్తామని మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా చెల్లించకుండా వదిలేసిందని, వాటి స్ధానంలో రిటైర్మెంట్ వయస్సు పెంచిందని తెలిపారు. దీంతో తమ ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కాబట్టి తాము వాటిని త్వరలోనే చెల్లించబోతున్నట్లు ప్రకటించారు.

Major Relief for Employees Telangana Govt Commits to Clearing All Pending Bills Including DA

బీఆర్ఎస్ సర్కార్ మొత్తంగా 40 వేల కోట్లకు పైగా బిల్లుల్ని పెండింగ్ లో పెట్టిందని, వీటిలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 4571 కోట్లు కూడా ఉన్నాయని మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. తాము వాటిని మానవతా కోణంలో క్లియర్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తోందని గుర్తుచేశారు. అలాగే ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన బకాయిలు కూడా క్లియర్ చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+