నగ్న చిత్రాలు పంపించమని యువతికి వేధింపులు.. మళ్లీ అరెస్ట్ అయిన కార్పొరేటర్ కుమారుడు

ఫేస్‌బుక్‌ పరిచయంతో ఓ యువతిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ కార్పొరేటర్‌ కుమారుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. తాను కోరినట్లుగా నగ్నచిత్రాలు పంపలేదనే కోపంతో...

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ పరిచయంతో ఓ యువతిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ కార్పొరేటర్‌ కుమారుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి కార్పొరేటర్‌ జగదీశ్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్‌ గౌడ్‌(20)ను సెప్టెంబర్‌లో నగర సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

man-arrest

అనంతరం బెయిల్‌పై విడుదలైన అభిషేక్‌ గౌడ్‌ గత నెల 17న వర డార్లింగ్‌ ప్రొఫైల్‌ పేరుతో ఓ యువతికి ఫ్రెండ్‌ రెక్వెస్ట్‌ పంపించాడు. రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్‌ చేయడంతో చాటింగ్‌ కొనసాగించాడు.

ఈ క్రమంలోనే ఆ యువతి నగ్నచిత్రాలు పంపించాలని అభిషేక్‌ గౌడ్ కోరాడు. దీనికి ఆ యువతి నిరాకరించడంతో ప్రొఫైల్‌ పిక్‌లో ఉన్న ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి పంపించాడు. తనతో చాటింగ్‌ చేయకపోతే ఆ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు.

దీంతో ఆమె రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నాగోలు క్రాస్ రోడ్డు వద్ద అభిషేక్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆధారాలు దొరక్కుండా తన ఫోన్‌ను అభిషేక్‌ ధ్వంసం చేసినా పోలీసులు టెక్నాలజీ సాయంతో అతడి ఫోన్‌లోని డేటాని రికవరీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+