తెలంగాణలో పోలీసుల లాఠీచార్జ్, గ్రామస్తులు రాళ్లతో తరిమికొట్టారు (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

మెదక్: రెండు నెలలుగా శాంతియుతంగా సాగిన మల్లన్న సాగర్‌ ఉద్యమం ఆదివారం నాడు ఉద్రిక్తంగా మారింది. ముంపు ప్రాంతంలోని రెండు గ్రామాల ప్రజలపై పోలీసులు లాఠీ ఝళిపించి, గాల్లోకి తూటాలు పేలిస్తే, పోలీసుల పైకి రాళ్లు రువ్విన గ్రామస్తులు, వారిని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు.

బాహాబాహీకి దిగారు. ఆదివారం రోజంతా రెండు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్న సాగర్‌ రిజర్వాయరుకు భూసేకరణను నిరసిస్తూ దాదాపు రెండు నెలలుగా తొగుట మండలం వేములఘాట్‌ ప్రజలు గ్రామంలోనే నిరాహార దీక్ష చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతై, ప్రభుత్వానికి తమ బాధను, నిరసనను తెలపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాజీవ్‌ రహదారిపై ఆదివారం ధర్నా, రాస్తారోకో చేయాలని నిశ్చయించారు. ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో వేములఘాట్‌ ప్రజలు గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరారు.

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

రోడ్డు పైన విధ్వంసం చోటుచేసుకుంటుందనే అనుమానంతో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలో పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

లాఠీచార్జి చేసి, పలువురు రైతులను అదుపులోకి తీసుకుని డివిజన్‌ పరిధిలోని ఆయా పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

లాఠీచార్జిలో గాయపడిన మహిళలను అంబులెన్స్‌లో గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు తమ వారిని అదుపులోకి తీసుకోవడాన్ని ఖండిస్తూ కొందరు యువకులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

విషయం తెలుసుకున్న తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డి గ్రామానికి చేరుకుని ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

గ్రామస్థులంతా లాఠీచార్జిని నిరసిస్తూ పోలీసుల దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోసారి మధ్యాహ్నం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆందోళనకారులు రాజీవ్‌ రహదారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

పల్లెపహాడ్‌ క్రాస్‌ రోడ్డు వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. దాంతో, పొలాలు, పుట్టల మీదుగా చెల్లాచెదురైన ఆందోళనకారులు కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామం చేరుకున్నారు. అక్కడ వేములఘాట్‌ గ్రామస్థులకు ఎర్రవల్లి గ్రామస్థులు జత కలిశారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

గ్రామ సమీపంలో డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు.. ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

దాంతో ఆందోళనకారులు చుట్టుపక్కల పొలాల్లోకి మళ్లారు. అక్కడి నుంచి ఎర్రవల్లి ఊళ్లోకి చేరుకుని రాళ్లు, కర్రలతో సిద్ధమయ్యారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

పోలీసులు ఊళ్లోకి ప్రవేశించగానే వారిపై ఎదురు దాడి చేశారు. రాళ్లు రువ్వారు. కర్రలతో తలపడ్డారు. దాంతో పోలీసులు మరోసారి లాఠీచార్జి చేశారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

పోలీసుల కంటే పెద్ద సంఖ్యలో ఉన్న ఆందోళనకారులు పోలీసులను తరిమికొట్టారు. ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటిస్తుండడంతో సిద్దిపేట 1 టౌన్‌ సీఐ సురేందర్‌ రెడ్డి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

ఈ క్రమంలో అక్కడే ఉన్న తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డిపై పోలీసులు లాఠీ ఝళిపించారు. అనంతరం, ఆందోళనకారులు, పోలీసులు రెండు వర్గాలుగా చీలిపోయారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

ఎర్రవల్లి గ్రామంలో బాహాబాహీకి దిగారు. ఆందోళనకారులు మరోసారి పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, దౌల్తాబాద్‌ ఎస్సై పరశురాం, కానిస్టేబుళ్లు సంతోష్‌, రమేశ్‌, స్వాతిరెడ్డి, రమేశ్‌లకు గాయాలయ్యాయి.

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మరో 30 మంది ఆందోళనకారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

సాయంత్రం వరకూ దాదాపు యాభై అరవై మంది పోలీసులు ఉండగా, సాయంత్రం మరో వంద మంది బలగాలు, 50 మంది మహిళా పోలీసులు రంగంలోకి దిగారు.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

గ్రామంలో కవాతు నిర్వహించారు. చివరికి, రాత్రి ఏడు గంటల తర్వాత గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

 మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తం

వేములఘాట్‌, ఎర్రవల్లి గ్రామాల్లో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mallanna Sagar flooded victims agitation, police opens firing.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి