కేసీఆర్! మా శవాలపై నిర్మించండి, బెదిరిస్తున్నారు: మహిళల కంటతడి
హైదరాబాద్: తాము మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ తమకు పరిహారం న్యాయబద్ధంగా ఉండాలని, తెరాస నాయకులు తమను బెదిరిస్తున్నారని ముంపు బాధిత మహిళా రైతులు సోమవారం నాడు కంటతడి పెట్టారు.
హైదరాబాదులో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ఐక్య కార్యజరణ సమితి సమావేశమైంది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల రైతులు మాట్లాడారు. ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
తాము పుట్టిన ఊరిని కాపాడుకుంటామని చెప్పారు. తాము ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ తమ భూమి తీసుకున్నందుకు పరిహారంగా ఎంత భూమి ఇస్తారో చెప్పాలన్నారు. తమ నుంచి ఎంత భూమి తీసుకుంటే అంతే భూమి ఇవ్వాలన్నారు. లేదంటే ఎకరాకు రూ.8 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

లేదంటే తమకు ప్రభుత్వం భూమిని కొని ఇవ్వాలన్నారు. భూమి ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకులు అల్టిమేటం జారీ చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ కంటతడి పెట్టారు.
జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... నిర్వాసితులు మల్లన్న సాగర్‌కు వ్యతిరేకం కాదని, పరిహారం పెంచాలని అడుగుతున్నారని చెప్పారు. షెడ్యూల్ 2 ప్రకారం భూమికి బదులు భూమి ఇవ్వాలి, దళితుల భూమి ఎకరాకు రూ.8 లక్షలు ఖర్చు చేస్తున్నారని, అలాగే నిర్వాసితులకు ఇవ్వాలన్నారు.
కేవలం రూ.5.80 లక్షలు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ప్రపంచంలో ఎక్కడా కాల్వల పైన 50 టీఎంసీల రిజర్వాయర్ లేదన్నారు. నిర్వాసితుల పైకి తెరాస కార్యకర్తలను ఉసిగొల్పడం సరికాదన్నారు. ముంపు గ్రామాల్లో మంత్రి హరీష్ రవు ఎందుకు పర్యటించలేదో చెప్పాలని నిలదీశారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే తమ శవాల పైన రిజర్వాయర్ నిర్మించాలని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications