ఆ ఎయిర్ పోర్ట్ పై కేంద్రమంత్రి శుభవార్త.. వారి కలలకు రెక్కలు!

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావలసిన 949 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు నేడు అందజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

మామునూరు ఎయిర్ పోర్ట్ భూముల అప్పగింత

బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భూముల అధికారిక అప్పగింత జరిగింది. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు అదనంగా 253 ఎకరాల భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం 295 కోట్ల రూపాయలు కేటాయించింది. నిర్మాణం పూర్తయితే, ఈ ఎయిర్‌పోర్ట్ వాణిజ్య, విమానయాన, ప్రాంతీయ అభివృద్ధి రంగాల్లో ప్రధానమైన కేంద్రంగా మారనుంది. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ, భూమి సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలను పూర్తిచేశామని తెలిపారు.

mamnoor airport lands handed over to union minister rammohan naidu minister said good news

మామునూరు ఎయిర్ పోర్ట్ పై మాట్లాడిన కేంద్రమంత్రి

ఈ సందర్భంగా కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మామునూరు ఎయిర్పోర్ట్ కల తాను చిన్నప్పటి నుంచి వింటున్నానని ఈ ఎయిర్పోర్టు సీఎం చొరవతో ముందుకు వచ్చిందని అన్నారు. స్వతంత్రం రాకముందే మామునూరులో ఎయిర్పోర్ట్ ఉండేదని, అయితే రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల మేరకు మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదన్న నిబంధన నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు జాప్యం జరిగిందని అన్నారు.

త్వరలోనే మామునూరు ఎయిర్పోర్టును ప్రారంభించుకుంటాం

కాకతీయుల వారసత్వం కలిగిన వరంగల్ కు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని, అటువంటి వరంగల్లో త్వరలోనే మామునూరు ఎయిర్పోర్టును నిర్మించి ప్రారంభించుకుంటామని మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. 850 కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్ట్ ఆధ్వర్యంలో పనులు చేపడతామన్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

రాష్ట్రాలు సహకరిస్తే ఎయిర్ పోర్ట్ లో నిర్మాణాలు

రాష్ట్రాలు సహకరిస్తే ఎయిర్పోర్ట్ లో నిర్మాణాలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కొత్త గూడెం, అదిలాబాద్ ప్రాంతాలలో కూడా ఎయిర్ పోర్ట్ లను నిర్మాణం చేస్తామని అన్నారు. వికసిత్ భారత్ నాటికి 300 ఎయిర్ పోర్ట్ లను నిర్మించాలని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాము ఆంధ్రప్రదేశ్ మీద ఎంత కమిట్మెంట్ తో పని చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అంతే కమిట్మెంట్ తో పని చేస్తున్నామన్నారు. రెండు నుండి రెండున్నర సంవత్సరాల లోపు మామునూరు ఎయిర్పోర్టును పూర్తి చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+