దారుణం: కోరిక తీర్చ‌లేద‌ని.. కోడలిపై గొడ్డ‌లితో దాడి చేశాడు

Subscribe to Oneindia Telugu

ద్దిపేట: జిల్లాలోని ఎన్సాన్‌పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన లైంగిక వాంఛ తీర్చలేదనే కోపంతో కోడలిపైనా, అందుకు అడ్డు వస్తోందని భార్యపైనా ఇంటి యజమాని గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో నిందితుడి భార్య మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే.. ఎన్సాన్‌పల్లికి చెందిన పూస పోచయ్య... కొన్నాళ్లుగా తన పెద్దకోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె ఈ విషయాన్ని అత్త లక్ష్మి (55)కి చెప్పగా, ఆమె భర్తను మందలించింది. ఈ క్రమంలో కోడలిపైనా, భార్యపైనా అతడు కక్ష పెంచుకున్నాడు.

murder

గురువారం తెల్లవారుజామున భార్యపై పోచయ్య గొడ్డలితో దాడిచేశాడు. తర్వాత కోడలిపైనా దాడికి తెగబడ్డాడు. ఇంతలో అతని కుమారుడు అడ్డుకోవడంతో పోచయ్య పరారయ్యాడు.కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి మృతిచెందింది. పరిస్థితి విషమంగా ఉన్న కోడలిని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి గర్భానికి కారణమైన యువకుడి అరెస్టు

హైదరాబాద్: యువతి గర్భానికి కారణమైన నిందితుడిని అల్వాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రేమ పేరుతో ఇంటర్‌ చదివే ఇద్దరు మైనర్లు హద్దులు దాటి శారీరక సంబంధాలు పెట్టుకొన్నారు. ఈక్రమంలో యువతి గర్భం దాల్చి పాపకు జన్మనివ్వడంతో విషయం వెలుగుచూసింది.

హద్దులు దాటిన ప్రేమ: బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని!

ప్రసవం రోజే ఈ ఘటనను ఎంఎల్‌సీ(మెడికల్‌ లీగల్‌ కేసు) గా పరిగణించి వైద్యులు అల్వాల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుడి (17)పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందిత యువకుడిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా, జువైనల్‌ హోంకు తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man allegedly attacked on his wife and daughter in law in Siddipet district on Thursday.
Please Wait while comments are loading...