భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య: భార్యపై అనుమానం, చిన్నారి సహా దంపతుల ఆత్మహత్యాయత్నం
ఖమ్మం: భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో జరిగింది. బస్టాండ్ సెంటర్ సమీపంలోని బావిలో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికిలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో శవాన్ని వెలికి తీశారు.
స్థానికంగా ఉండే బట్టు రవి అనే వ్యక్తి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితమే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. రవి భార్య కుటుంబ కలహాల కారణంగా మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో మనస్తాపానికి గురై రవి అహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

ఆశా వర్కర్ ఆత్మహత్య
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం విషాద సంఘటన జరిగింది. బెజ్జంకి మండలం బేగంపేటలో గంగాభవాని అనే ఆశావర్కర్ పురుగుల మందు తాగింది.దాంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా వేతనాల పెంపు కోసం ఆశావర్కర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
చిన్నారి సహా దంపతుల ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాల కారణంగా నల్లగొండ జిల్లాలో చిన్నారి సహా దంపతులు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. సూర్యూపేట సైనిక్‌పురి కాలనీలో నివాసం ఉంటున్న కోటేశ్వరరావు (32) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య పద్మ (28) మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తరుచూ గొడవ పడుతుండేవాడు.
ఆ విషయంపై శుక్రవారం ఇరువురి మధ్య గొడవ జరిిగంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తూరుు శ్రీవాణి (4)కి తాగించి ఇద్దరు తాగారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications