భార్య పుట్టింటికి వెళ్లడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

హైదరాబాద్: పండుగకు భార్య పుట్టింటికి వెళ్లడం లేదని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం - ఉప్పుగూడ శివాజీనగర్‌కు చెందిన చక్రపాణి (30), భార్య ఇద్దరు పిల్లలున్నారు.

దసరా పండుగకు భార్యను పుట్టింటికి వెళ్లాల్సిందిగా కోరాడు. అయితే ఆమె వెళ్లనని చెప్పడంతో ఆదివారం రాత్రి ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్య మరో గదిలో నిద్రపోయింది. బెడ్‌రూంలోకి వెళ్లిన చక్రపాణి బాత్‌రూంలో ఉన్న సిమెంట్ వెంటిలెటర్‌కు చీరతో ఉరివేసుకున్నాడు. ఉదయం నిద్రలేచిన భార్య గమనించి స్థానికులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చారీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

man commits suicide, as wife rejects to go to her parental house

బయటపడిన శవం

ఇదిలావుంటే, శంషాబాద్ కాముని చెరువు సమీపంలో రెండు రోజుల కిందట చేపల వేటగాళ్ల ఘర్షణలో హత్యకు గురైన వ్యక్తి మృతదేహాం సోమవారం బయటపడింది. హైదరాబాద్ నగరానికి చెందిన చెప్పుల వ్యాపారి ఎండి ముజ్దబా అలీ(40)గా పోలీసులు గుర్తించారు.

ఆదివారం మరో మిత్రుడితో కలిసి నగరంలోని శాలిబండ పరిధిలోని చక్కర్‌గంజ్‌కు చెందిన ముజ్దబా కాముని చెరువు వద్దకు వచ్చాడు. ఇంతలో మరో నలుగురు వచ్చి అతనిపై కత్తులతో దాడికి దిగి హత్య చేశారు. అనంతరం చెరువులో పడేసి పరారయ్యారు. అలీని దారుణంగా హత్య చేశారు.మరో కత్తి అతని మెడలోనే దిగి ఉంది. అన్ని కోణాల నుంచి శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+