భార్య ,కొడుకును చంపి పారీపోయిన భర్త... మూసాపేటలో దారుణం
హైదరాబాద్‌లోని మూసపేటలో దారుణం జరిగింది. భార్యతోపాటు నాలుగు సంవత్సరాల కొడుకును కూడ దారుణంగా చంపి పారిపోయాడు ఓ కిరాతకుడు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేశ్ అతని భార్య ఊర్మీళ కొడుకు కిసాన్‌తో కలిసి గత పదిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ మూసాపేటలోని జింకల వాడలో అద్దెకు దిగాడు. అయితే రాజేష్ యూపిలో ఇద్దరు బార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న ఇద్దరి మధ్య ఘర్షణలు మాత్రం చల్లారలేదు. గొడవల నేపథ్యంలోనే ఇద్దరికి సర్ధిచెప్పేందుకు రాజేష్ మేనల్లుడైన దీపక్
అతని భార్య కూడ అదే ఇంట్లో అద్దేకు ఉంటున్నారు.

అయితే ఆదివారం ఉదయం దీపక్ ఆయన భార్య ఉద్యోగ రిత్యా బయటకు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చే సరికి రాజేష్ ఇంటికి తాళం వేసి ఉండడంతో సుమారు రెండు గంటల పాటు దీపక్ వేచి ఉన్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన రాజేష్ లిఫ్టు చేయకపోవడంతో అనుమానంతో ఇంటి తలుపులను పగులగొట్టాడు.
ఇక లోపలికి వెళ్లి చూసేసరికి రాజేష్ భార్య ఊర్మీళ రక్తం మరకలతో పడిపోయి ఉంది తలపై ఇనుపరాడ్‌తో కొట్టడడంతో చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. కాగా రాజేష్ కొడుకును సైతం మట్టుపెట్టాడు. చిన్నారీ కిసాన్ మృతదేహం బాత్‌రూంలో పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications