వాహనంలో ఢీకొట్టి, వెంబడించి రాడ్లతో కొట్టి చంపేశారు
హైదరాబాద్: ఓ వ్యక్తిని వెంటాడి ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాది హత్య చేసిన సంఘటన శుక్రవారం రాత్రి హైదరాబాదులోని లక్డికా పూల్‌లో జరిగింది. ఘటన స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాలను బట్టి మహ్మద్ సోహెల్‌గా అనుమానిస్తున్న వ్యక్తిని అర్థరాత్రి సమయంలో సైఫాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చంపేశారు.
సొహైల్ అనే వ్యక్తి శుక్రవారం అర్థరాత్రి సమయంలో టిఎస్11ఈబి112 ద్విచక్ర వాహనంపై రంగారెడ్డి కలెక్టరేట్ వైపు వస్తున్నాడు. వెనుక నుంచి వాహనంలో వెంబడించిన దుండగులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో సొహైల్ కింద పడిపోయాడు. వెంటనే వారు రాడ్లతో దాడి చేయడానికి రాగా అతను తప్పించుకుని ఎదురు ఉన్న సంధ్య రెస్టారెంట్‌లో పరుగులు తేశాడు.
వెంబడించి వచ్చిన దుండగులు రాడ్లతో బలంగా సొహైల్‌ను కొట్టారు. దాంతో సొహైల్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్, సైఫాబాద్ ఎసిపి సురేందర్ రెడ్డి, డిఐ ప్రకాష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతుని జేబులో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది మృతదేహం సమీపంలో సెల్‌ఫోన్ కూడా లభ్యమైంది. ద్విచక్రవాహనంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. హోటల్ సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సిసి కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సొహైల్‌ను ఇద్దరు వ్యక్తులు హత్య చేసిన సంఘటన కూడా సిసి కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. సొహైల్ పాతబస్తీలో గాజులు, గిల్ట్ నగల వ్యాపారం చేసుకుంటాడు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ తన వద్దకు వసూళ్ల కోసం వచ్చిన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడానికి అతను నిరాకరించినట్లు సమాచారం. దానివల్లనే సొహైల్‌ను ఇంటికి వెళ్తుండగా వారిద్దరు వెంబడించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

అర్థరాత్రి హత్య
సొహైల్ అనే గిల్ట్ నగలు, గాజుల వ్యాపారిని దుండగులు శుక్రవారం అర్థరాత్రి వెంబడించి హత్య చేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని లక్డికా పూల్‌లో జరిగింది.

ఇలా వెంబడించి..
దుకారణం మూసేసుకుని స్కూటీపై ఇంటికి వెళ్తున్న సొహైల్‌ను దండగులు వాహనంలో వెంబడించారు. లక్డికా పూల్ వద్ద వాహనంతో స్కూటీని ఢీకొట్టారు.

హోటల్లోకి పెరిగెత్తాడు
వాహనం ఢీకొట్టడంతో కిందపడిపోయిన సొహైల్ సమీపంలోని హోటల్లోకి పరిగెత్తాడు. హోటల్ వరకు దుండగులు వెంబడించి అతన్ని చంపేశారు.

మామూళ్లు ఇవ్వకపోవడం వల్లనే..
మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించడం వల్లనే సొహైల్‌ను దుండగులు సొహైల్‌ను దారుణంగా హత్య చేశారని అనుమానిస్తున్నారు.

సిసి కెమెరా ఫుటేజీల్లో..
సొహైల్‌ను హత్య చేసిన ఘటన హోటల్‌లోని సిసి కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు నిందితులను గుర్తించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications