తాగిన మైకంలో గొంతు నొక్కి తమ్ముడ్ని చంపేశాడు
ఆదిలాబాద్ : తాగిన మైకంలో ఓ వ్యక్తి తన తమ్ముడి గొంతు నొక్కి చంపేశాడు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోరిగాం గ్రామ పంచాయతీ పరిధిలోని గుత్పాల గ్రామంలో గురువారం రాత్రి దసరా వేడుకల్లో ఈ సంఘటన జరిగింది.
సిడాం రవీందర్(20)కి అతడి అన్న సిడాం దేవ్‌రావ్‌కు గొడవ జరిగింది. దేవ్‌రావ్, రవీందర్ గొంతు నొక్కడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. దేవరావ్ తాగిన మైకంలో తరచూ గ్రామంలో గొడవ పడేవాడు. అయితే దసరా రోజున కూడా తాగి వచ్చిన దేవరావ్ ఎవరితోనైనా గొడవ పడుతాడేమోనని భార్య భయపడింది.

ఈ క్రమంలో దేవరావ్ ను ఇంట్లోనే ఉంచాలనుకుంది. ఇక మరిది రవీందర్ ను పిలిచి దేవరావ్ ను ఇంట్లోనే ఉంచి గడియపెట్టాలని కోరడంతో అతడు గడియవేశాడు.
దీంతో కొంత సమయం తరువాత తలుపు పగులగొట్టి బయటకు వచ్చిన దేవరావ్ గడియ పెట్టిన తమ్ముడు రవిందర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. తాగిన మత్తులో తమ్ముడి గొంతు నులిమి చంపాడు. మృతుడికి భార్య కూతురు ఉన్నారు.












Click it and Unblock the Notifications