రెండో భార్యతో కలిసి మొదటి భార్య హత్య: అక్రమ సంబంధాలు అంటగట్టి భార్య హత్య

కరీంనగర్/ ఖమ్మం: ఓ వ్యక్తి తన మొదటి భార్యను రెండో భార్యతో కలిసి చంపేశాడు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ పరిధిలోని బాకూర్‌పల్లి తండాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన గుగులోత్ రమేశ్,కళావతి(28)కి ఏడేండ్ల కిందట వివామైంది. వీరికి ఒక కూతురు ఉన్నది. ఇద్దరి మధ్య గొడవలు తీవ్రమై రెండేండ్ల కిందట పెద్దమనుషుల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.

కొంత డబ్బు కళావతికి చెల్లించాలని పెద్దలు నిర్ణయించారు. తర్వాత అనితను రమేశ్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి కొడుకు పుట్టాడు. ఒప్పందం ప్రకారం డబ్బు ఇవ్వకపోవడంతో నెల రోజులుగా రమేశ్ ఇంట్లోనే కళావతికి ఉంటోంది. గురువారం కట్టెలు తేవడం కోసం ఇద్దరు భార్యలతో రమేశ్ అడవికి వెళ్లాడు.

అక్కడ ఇద్దరు భార్యలు గొడవపడడంతో ఆవేశానికి లోనై భర్త రెండో భార్య అనితతో కలిసి కళావతిని బండరాయితో కొట్టి హతమార్చాడు. శుక్రవారం ఇరుగుపొరుగుకు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.

Man kills first wife with the help of second wife

ఇదిలావుంటే, కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగింది. పట్టణానికి చెందిన తొర్తి వెంకటేశ్వర్లు 17 ఏండ్ల కిందట వరంగల్ జిల్లా ఏటూరునాగారానికి చెందిన వికలాంగురాలైన సువర్ణ(33)ను పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరుపిల్లలు.

అంధవికారంగా ఉన్నావని, వేరేవారిని చేసుకుంటే కట్నం ఎక్కువగా వచ్చేదంటూ నాలుగేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. ఆమెకు వివాహేతర సంబంధాలు అంటగడుతూ నిత్యం చిత్రహింసలు పెడుతున్నాడు. శుక్రవారం విపరీతంగా మద్యం తాగివచ్చి భార్య తో గొడవకు దిగాడు. ఆవేశంలో సెల్‌ఫోన్ చార్జింగ్ వైరును సువర్ణ మెడకు బిగించి హతమార్చాడు. ఆత్మహత్యగా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి విఫలమై పోలీసులకు లొంగిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+