గొంతు కోసి భార్యను చంపిన భర్త... ఆపై ఆత్మహత్య... ప్రేమ పెళ్లి చేసుకున్న ఆర్నెళ్లకే...
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు... కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే భర్త వరకట్న వేధింపులు,అనుమానం కాపురంలో చిచ్చు పెట్టాయి. ఇద్దరి మధ్య గొడవలు నిత్యకృత్యమయ్యాయి. ఇదే క్రమంలో భర్త క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు.ఆపై రైలు కిందపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రేమ వివాహం చేసుకున్న జంట పెళ్లయిన ఆర్నెళ్లకే ఇలా చనిపోవడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

అసలేం జరిగింది...
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు చెందిన సిరిపురం హరిశంకర్,మల్హర్ మండలానికి చెందిన రాగిణి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలానికి ఈ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పారు. హరిశంకర్ వైశ్య సామాజికవర్గం,రాగిణి పద్మశాలి సామాజికవర్గానికి చెందిన అమ్మాయి కావడంతో పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డారు. కానీ ఇరువురి పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరించారు. అలా ఆర్నెళ్ల క్రితం ఇద్దరూ మూడుముళ్లతో ఒక్కటయ్యారు.

అనుమానం,వరకట్న వేధింపులు...
వివాహం తర్వాత హరిశంకర్-రాగిణి ఓ ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొంతకాలం ఇద్దరి అనుబంధం అన్యోన్యంగానే సాగింది. కానీ ఆ తర్వాత హరిశంకర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానని తరుచూ భార్యను బాధపెట్టేవాడు. అంతేకాదు,రాగిణికి మరొకరితో సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు.

గొంతు కోసి హత్య చేశాడు....
వరకట్న వేధింపులు,అనుమానంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. అలా విషయం పెద్ద మనుషుల పంచాయితీ దాకా వెళ్లింది. పెద్దమనుషులు ఇద్దరికీ నచ్చజెప్పినప్పటికీ.. హరిశంకర్‌లో మార్పు రాలేదు. బుధవారం(జులై 7) ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన హరిశంకర్ క్షణికావేశంలో కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటిరోజు పక్కింటివారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రక్తపు మడుగులో రాగిణి విగతజీవిలా కనిపించింది.
Recommended Video

రైలు కింద పడి ఆత్మహత్య...
రాగిణిని హత్య చేసిన హరిశంకర్... ఆ తర్వాత కొద్ది గంటలకే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అటు రాగిణి హత్య,ఇటు హరిశంకర్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన ఆర్నెళ్లకే ఈ జంట ఇలా చనిపోవడం ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications