అక్రమ సంబంధమని హత్య: భర్తనే.. (ఫొటోలు)
కరీంనగర్: కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్-కొత్తకొండ రహదారిలో మంక్యానాయక్ తండా శివారులో మంగళవారం ఉదయం గుగ్లోతు రజిత(30) దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని హుస్నాబాద్ సీఐ గడ్డం సదన్‌కుమార్, ముల్కనూర్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ సత్యనారాయణ పరిశీలించారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మం డలం వేలేరు హామ్లెట్ మిరపకుంట తండాకు చెందిన రజితకు హుస్నాబాద్ మండలం జిల్లెల్ల గడ్డ కు చెందిన గుగ్లోతు రమేశ్‌తో 15ఏళ్ల క్రితం వివా హమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.

నాలుగు నెలల క్రితం గుగ్లోతు రజితకు మీర్జాపూర్ గ్రామ హామ్లెట్ పుల్‌నాయక్ తండాకు చెందిన లవుడ్య నీమతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడగా, రెండునెలల క్రితం అతనితో వెళ్లిపోయింది. తన భార్య కనిపించడం లేదని రజిత భర్త రమేశ్ హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దానిపై కేసు నమోదైంది. పోలీసులు, బంధువులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో రమేశ్ తన భార్య రజితను తిరిగి కాపురానికి తీసుకెళ్లా డు.

కొన్ని రోజులుగా రజిత మళ్లీ నీమని కలుస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య తగాదా ఏర్పడింది. తన భార్య ఇక మారదనుకున్న రమేశ్ మంగళవారం వేకువజామున తన బైక్‌పై అత్తారిల్లు మిరపకుంట తండాకు తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పదునైన ఆయుధంతో రజిత మెడపై నరికినట్లు తెలుస్తున్నది. రజిత కళ్లద్దాలు విరిగిపోవడంతోపాటు మృతదేహాన్ని లాక్కెళ్లి మెడపై నరికినట్లు సంఘటనా స్థలం వద్ద ఆనవాళ్లున్నాయి. రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలానికి రజిత తల్లిదండ్రులతోపాటు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. హత్య తర్వాత రమేశ్ ములుకనూ రు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఆమె బైక్‌పై నుంచి ప్రమాదవశాత్త్తూ కింద పడి చనిపోయింద ని చెప్పాడు. రజితను భర్త రమేశ్ చంపాడా? లేక ఏదైనా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామని సీఐ సదన్‌కుమార్ తెలిపారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications