వెలి భయం: ఒకేసారి ఇద్దరు మహిళలను పెళ్లాడిన వ్యక్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో విచిత్రమైన పెళ్లి జరిగింది. వాజేడులో మేక రమేష్ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. వాజేడు మండలం, జంగాలపల్లికి చెందిన మేక రమేష్ దేవి, సుషిత అనే ఇద్దరు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు.
ఆ విషయం ఊరంతా తెలిసింది. కులాచారాల ప్రకారం పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే బహిష్కరణ శిక్ష విధించే అవకాశం ఉంది. దీంతో భయపడిన రమేష్ తరఫు బంధువులు ఇద్దరు మహిళలను ఒప్పించి రమేష్‌తో వివాహం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బైక్‌పై వెళ్తున్నయువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈవ్‌టీజర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన హైదరాబాదులోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకున్న యువతి చెప్పుతో యువకుడి పని పట్టింది. చుట్టుపక్కలవారు కూడా వచ్చి ఈవ్‌టీజర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

అదిలాబాదు జిల్లాలో సరైన పత్రాలు లేకుండా బంగారాన్ని విక్రయిస్తున్న ముంబై వ్యాపారిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి శ్రీనగర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఆరు తులాల బంగారం, రూ.40వేల నగదు, బైకు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications