ఇంటికి వెళ్లి, బంజారాహిల్స్‌లో సినీ ఆర్టిస్ట్‌తో అసభ్య ప్రవర్తన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినిమా ఆర్టిస్టుగా పని చేసే మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి దూరి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.

ఇందిరా నగర్‌లో ముప్పై ఏళ్ల సినీ ఆర్టిస్టు కుటుంబంతో కలిసి ఉంటోంది. ఇదే ప్రాంతంలో ఉండే జయరామ్‌ అనే వ్యక్తికి ఆర్టిస్ట్ భర్త రూ.30వేలు బాకీ ఇవ్వాల్సి ఉంది. అప్పు అడిగేందుకని ఆదివారం వారింటికి వెళ్లిన జయరామ్‌ సినీ ఆర్టిస్టు ఫోన్‌ను లాక్కొని, అసభ్యంగా ప్రవర్తించాడు.

man miss behave with cine artist

అతని నుంచి తప్పించుకున్న ఆమె కేకలు వేసి బయటకు వచ్చింది. స్థానికులు వచ్చేసరికి జయరామ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
man miss behave with cine artist in Film Nagar in Hyderabad on Sunday morning. She complained to Banjara Hills police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X