వంశీ షాకింగ్: టెక్కీలను బంధించి, కంపెనీపై పట్టు సాధించాడు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బావమరిదిని అంటూ మాయమాటలతో హల్‌చల్ చేసి ఐటీ సంస్థలను తుపాకీతో బెదిరించిన ఘటనలో కొద్ది రోజుల క్రితం వంశీ అరెస్టయ్యాడు.

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బావమరిదిని అంటూ మాయమాటలతో హల్‌చల్ చేసి ఐటీ సంస్థలను తుపాకీతో బెదిరించిన ఘటనలో కొద్ది రోజుల క్రితం వంశీ అరెస్టయ్యాడు.

వంశీ గురించి షాకింగ్ విషయాలు

వంశీ గురించి షాకింగ్ విషయాలు

అతనికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. వంశీ, ఆయన ముఠా కొందరు ఐటీ సంస్థ నిర్వాహకులను దాదాపు 50 రోజుల పాటు నిర్బంధించింది. ఆ గ్రూప్ నుంచి తప్పించుకున్న వారు ఫిర్యాదు చేశారు.

వీరి వల్లే వంశీ బాగోతం వెలుగులోకి

వీరి వల్లే వంశీ బాగోతం వెలుగులోకి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బోయిళ్ల సాయిచరణ్‌, మార్కాపురంకు చెందిన అరటోలు అభిషేక్‌‌లు రాయదుర్గంలో ఎటర్నల్‌ క్వెస్ట్‌ ఐటీ సర్వీసెస్‌ సంస్థ భాగస్వాములు. వారి ఫిర్యాదుతో వంశీ బాగోతం వెలుగు చూసింది.

ఇదే అదనుగా..

ఇదే అదనుగా..

వారి సంస్థలో పని చేసి మానేసిన ఇద్దరు ఉద్యోగులు.. తమకు సరిగా జీతాలు ఇవ్వలేదని వంశీని ఆశ్రయించారు. ఇదే అదనుగా తాను మంత్రి కెటిఆర్ బావమరిదిని అని చెప్పి, వారిని బెదిరించాడు. బంధించాడు.

సొంత ప్లాట్లోనే బంధించాడు

సొంత ప్లాట్లోనే బంధించాడు

సాయిచరణ్, అభిషేక్‌లను తమ సొంత ప్లాట్‌లోనే వంశీ బంధించాడని తెలుస్తోంది. వారిని దాదాపు 50 రోజుల పాటు బందించారు. అంతేకాదు, వంశీ, ఆయన గ్యాంగ్‌ వారి ఐటీ కంపెనీపై పట్టు సాధించారు. అభిషేక్, సాయిచరణ్‌ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత బాధితులు అతని నుంచి తప్పించుకొని ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+