పుటేజీలో రికార్డు: చనిపోయేందుకు కావాలనే కారు కింద పడ్డాడు (వీడియో)

హైదరాబాద్: ఈ వీడియోని చూస్తే ఇలాగ కూడా చనిపోవచ్చా? అనే ఆశ్చర్యం కలగొచ్చు. అది మోహిదీపట్నం లంగర్‌హౌజ్ ప్రాంతం. ఇంద్రారెడ్డి ఫ్లైవర్‌ వద్ద ఈ నెల 14న సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు.

ఫ్లైఓవర్‌ పైనుంచి కిందకు వస్తున్న ఒక్కో వాహనాన్ని నిశితంగా గమనిస్తూ.. కొంచెం తులుతూ ముందుకు కదులుతున్నాడు. ఇంతలో ఓ కారు రావడాన్ని గమనించాడు. ఇంకేముంది లుంగీ కట్టుకున్న ఆ వ్యక్తి వేగంగా పరిగెత్తుకొని వచ్చి కారుకు అడ్డంగా వచ్చి పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Man tried to commit suicide on road in lungarhouse, Hyderabad

ఇంతలో షాక్ తిన్న ఆ వాహన యజమాని కంగారుగా అతడిని చూశాడు. గాబరా పడిన కారు డ్రైవర్‌ వాహనాన్ని ఆపేలోపే ముందు టైర్లు అతనిపై నుంచి దూసుకుపోయాయి. దీంతో తీవ్ర గాయాలైన అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు వారం తర్వాత ప్రాణాలు విడిచాడు.

ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మంగళవారం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా విషయం వెలుగు చూసింది. ఇంతకీ మృతుడు ఎవరు? ఎందుకు నడిరోడ్డుపై ఆత్మహత్యకు ప్రయత్నించాడన్న విషయాలు ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+