పోస్టల్ బ్యాలెట్ లో విష్ణు టీంకు మెజార్టీ : భారీగా క్రాస్ ఓటింగ్ - చెల్లని ఓట్లతో అభ్యర్ధుల్లో టెన్షన్...!!
"మా" ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగటంతో తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఓట్లలో మంచు విష్ణు ప్యానెల్ ముందంజ లో ఉంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో తొలి నుంచి విష్ణు జాగ్రత్తలు తీసుకున్నారు. సభ్యులు ఎవరైతే 60 ఏళ్లు దాటి..పోలింగ్ కేంద్రానికి రాలేకపోతున్నారో వారికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కేటాయించారు. దీంతో..పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనే వారి తరపున ఒకే సారి విష్ణు డబ్బు కట్టటం పైన ప్రకాశ్ రాజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంటే వారిని ప్రలోభాలకు గురి చేయటమేనని ఆరోపించారు.

వివాదంతోనే కౌంటింగ్ ప్రారంభం
అదే విధంగా ఎన్నికల అధికారి సైతం పోటీలో ఉన్న అభ్యర్ధి నుంచి ఓటర్లు చెల్లించాల్సిన డబ్బులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారుద. అప్పటికే ఎన్నికల అధికారి తిరిగి విష్ణుకు ఆ డబ్బులు తిరిగి పంపేసారు. ఆ తరువాత ఆ వివాదం ముగిసింది. ఇక, ఈ రోజు పోలింగ్ తరువాత కౌంటింగ్ ప్రారంభం సమయంలో కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల అధికారులు-ప్రకాశ్ రాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ ఉన్న ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవటం వివాదం ముగిసింది.

పోస్టల్ బ్యాలెట్స్ లో విష్ణు గ్రూపు ముందంజ
ఇక, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తరువాత ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అందులో ఈసీ మెంబర్ల కోసం పడిన ఓట్లలో 50 వరకు చెల్లనివిగా ఉన్నట్లు సమాచారం. దీంతో..ఈసీ సభ్యులుగా పోటీ చేసిన వారిలో టెన్షన్ మొదలైంది. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటు కీలకంగా మారింది. దీంతో ఓట్లు చెల్లకపోవటంతో రెండు శిబిరాలకు చెందిన అభ్యర్ధులు టెన్షన్ కు లోనవుతున్నారు. ఇదే సమయంలో ఈసీ మెంబర్లవి లెక్కింపు ముగిసిన తరువాత వరుస క్రమంలో ప్రధాన కార్యదర్శి పోస్టు వరకు లెక్కింపు జరగనుంది.

చివరగా అధ్యక్ష ఓట్ల లెక్కింపు
ఆ తరువాత చివరిగా ప్రెసిడెంట్ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లను లెక్కించి..ఆ తరువాత తుది ఫలితం వెల్లడిస్తారు. దీంతో..మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మరో రెండు గంటలకు పైగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే ప్రకాశ్ రాజ్..విష్ణు టీంలకు చెందిన సభ్యులు ఉన్నారు. వీరికి మద్దతుగా మోహన్ బాబు..మురళీ మోహన్ వంటి వారు సైతం కౌంటింగ్ సెంటర్ లోనే వెయిట్ చేస్తున్నారు. ఎవరికి వారు విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నా కౌంటింగ్ సాగుతున్న కొద్దీ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రతీ ఓటు కీలకంగా... టెన్షన్
రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావటం..ప్రతిష్ఠాత్మకంగా ఎన్నికలను తీసుకోవటంతో ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల సాధారణ ప్రజలు సైతం ఈ ఫలితాల కోసం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. మొత్తం 883 ఓట్లు ఉండగా..665 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థాయిలో పోలింగ్ జరగటం మా చరిత్రలో ఇదే తొలి సారిగా చెబుతున్నారు. దీంతో..మరి కాసేపట్లోనే ముందుగా ఈసీ మెంబర్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video

భారీగా క్రాస్ ఓటింగ్
ఇక మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అధ్యక్షుడిగా ఒకరికి వేసిన ఓటర్లు ఇతర ప్యానెల్ సభ్యుల విషయంలో మాత్రం అద్యక్ష అభ్యర్ది మద్దతు ప్యానల్ సభ్యులకే ఓట్లు వేయలేదనేది స్పష్టంగా తెలుస్తోం. అధ్యక్ష అభ్యర్ధికి ఒకరికి వేసి ప్రత్యర్ధి ప్యానెల్ లోని ఇతర పోస్టులు..ఈసీ సభ్యులకు ఓట్లు వేసినట్లుగా ప్రాధమిక సమాచారం అందుతోంది. దీంతో..ఇప్పుడు ఏక మొత్తంగా అధ్యక్షుడితో సహా అందరూ ఒకే ప్యానల్ సభ్యులు గెలిచే పరిస్థితి లేదనే చెప్పాలి. రెండు ప్యానళ్లోని సభ్యుల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోందిజ












Click it and Unblock the Notifications